Aarti Ravi : విచిత్రం ఏమిటంటే సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కొందరు ఇలాగే విడాకులు కావాలంటూ బయట పడుతున్నారు. రోజు రోజుకు ఇలాంటి కేసులు పెరుగుతూ వచ్చాయి. ఈ సమయంలో ఉన్నట్టుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది జయం రవి ఆర్తి రవి. తనను కావాలని ఇబ్బంది పెడుతున్నాడంటూ వాపోయింది. కన్నీటి పర్యంతం అయ్యింది. ఈ ఇద్దరికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఆయాన్, ఆరవ్.
Aarti Ravi Shocking Comments
అయితే జయం రవిపై తీవ్ర ఆరోపణలు చేసింది ఆర్తి రవి. తను సింగర్ కెన్నీషాతో గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నాడని, అందుకే కావాలని తమను నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడని వాపోయింది. తను పరిచయం కానంత వరకు జయం రవి తమను బాగానే చూసుకునే వాడని, తను ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో తమకు ఆనాటి నుంచి కష్టాలు మొదలయ్యాయంటూ కన్నీటి పర్యంతమైంది. మొత్తంగా ఆర్తి రవి చేసిన కామెంట్స్ ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.
Also Read : Natural Star -Kayadu Lohar :నేచురల్ స్టార్ తో డ్రాగన్ హీరోయిన్