విలక్షణ నటుడిగా గుర్తింపు పొందారు ప్రముఖ నటుడు పరేష్ రావల్. తను ఎక్కువగా ఎవరి విషయంలో జోక్యం చేసుకోడు. ఇతరులు తన పట్ల జోక్యం చేసుకున్నా సీరియస్ గా తీసుకుంటాడు. తనకు వయసు మీద పెరుగుతున్నా ఎక్కువగా సినిమాలలో నటించేందుకు ఛాన్స్ లు కూడా వస్తుండడం విశేషం. అయితే ఉన్నట్టుండి తనకు కోలుకోలేని షాక్ తగిలింది. అది ఎవరో కాదు తన సహచర నటుడు, ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ నుంచి.
తనకు ఏకంగా లీగల్ నోటీసు పంపించాడు. ఏకంగా రూ. 25 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయడం కలకలం రేపింది సినిమా రంగంలో. హేరా ఫేరీ 3 షూటింగ్ నుంచి పరేష్ రావల్ చెప్పకుండా మధ్యలోనే వెళ్లి పోయాడంటూ పంపించిన లీగల్ నోటీసులో పేర్కొన్నారు. వెంటనే ఆ డబ్బులు తనకు చెల్లించాలని కోరాడు.
ఇదిలా ఉండగా గతంలో హేరా ఫేరీ బిగ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత సీక్వెల్ గా మరో మూవీ వచ్చింది. అది బిగ్ సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మూవీ మేకర్స్ సంచలన ప్రకటన చేశారు. దీనికి మూడో చిత్రంగా మరో మూవీ చిత్రీకరణ ఉంటుందని ప్రకటించారు. దీనికి దర్శకుడు ప్రియదర్శన్. తన టేకింగ్ , మేకింగ్ లో వెరీ స్పెషల్. షూటింగ్ లో పాల్గొంటానని పరేష్ రావల్ ఒప్పందం చేసుకున్నాడు. కొంత కాలం నటించాడు. కానీ ఉన్నట్టుండి జంప్ అయ్యాడు.
దీంతో తీవ్రంగా మండిపడ్డాడు అక్షయ్ కుమార్. తను వెళ్లి పోవడం వల్ల సినిమాకు సంబంధించి భారీగా నష్టం సమకూరిందంటూ పేర్కొన్నాడు. విచిత్రం ఏమిటంటే అక్షయ్ తన స్వంత నిర్మాణ సంస్థ ద్వారా ఈ మూవీని తీస్తున్నాడు. అయితే తనకు లీగల్ నోటీస్ ఇవ్వడం పట్ల స్పందించాడు పరేష్ రావల్. తనకు దర్శకుడి పట్ల అపారమైన ప్రేమ, నమ్మకం ఉందన్నాడు. కానీ ఎందుకు వైదొలిగాడో మాత్రం చెప్పక పోవడం గమనార్హం.
