టాలీవుడ్ నటుడు, ప్రయోక్త అక్కినేని నాగార్జునపై ప్రశంసలు కురిపించాడు తమిళ సినీ హీరో ధనుష్. ప్రస్తుతం ఈ ఇద్దరూ కలిసి పాన్ ఇండియా మూవీ కుబేరలో నటించారు. దిగ్గజ నటుడితో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు . తను షూటింగ్ లో చాలా కష్టపడ్డాడనని, ఈ విషయంలో కూడా తన డెడికేషన్ తనను ఆక్టటుకునేలా చేసిందన్నాడు ధనుష్. ముఖ్యంగా తమిళ చిత్రం రచ్చగన్‌ను సంవత్సరాలుగా తనతో పాటు నిలిచి ఉండటం తనకు ఇష్టమైన వాటిలో ఒకటిగా హైలైట్ చేశాడు.
ఇటీవల తమిళనాడులో ధనుష్ చిట్ చాట్ చేశాడు. నాగార్జున ఎన్నో సినిమాలు చేశారు. ఆయనకు తమిళంలో కూడా అభిమానులు ఉన్నారని చెప్పాడు. తాను కూడా ఆయనకు అభిమానినేని పేర్కొన్నాడు.
రచ్చగన్ మూవీకి తాను ఫ్యాన్ గా మారి పోయానని తెలిపాడు.
ధనుష్ సినిమా సెట్‌లో తన అనుభవం గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించాడు, చాలా సంవత్సరాలుగా తాను ఆరాధించే వ్యక్తితో కలిసి నటించడం తనకు ఎంత గర్వంగా అనిపించిందని పేర్కొన్నాడు. తన నటనను చూసి చాలా నేర్చుకున్నట్లు తెలిపాడు ఈ యంగ్ హీరో. తను నిజంగా స్పూర్తి దాయకమని అన్నాడు.
షూటింగ్ సమయంలో ఆయన నుండి నేర్చుకున్న పాఠాలు ఎప్పటికీ నాతోనే ఉంటాయన్నాడు. నా కెరీర్ లో ఆయన మార్గాన్ని అనుసరించడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తానని స్పష్టం చేశాడు.
