కోలీవుడ్ లో టాప్ హీరో, దర్శకుడు, నిర్మాత ధనుష్. తను నటించిన ఇడ్లి కడైకి మంచి స్పందన లభిస్తోంది. ఇదే సమయంలో తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేరలో నటించాడు. ఇందులో ధనుష్ తో పాటు అక్కినేని నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కలిసి నటించారు. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే కుబేరకు సంబంధించి పోస్టర్స్, గ్లింప్స్ కు మంచి స్పందన లభించింది. తాజాగా ఓ పాటను రిలీజ్ చేశారు. ఈసందర్బంగా ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు ధనుష్.
శేఖర్ కమ్ములపై ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన టాలెంట్ కలిగిన గొప్ప దర్శకుడు అంటూ కితాబు ఇచ్చాడు. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉందన్నాడు. కుబేర చిత్రంలో తన పాత్ర హృదయానికి దగ్గరగా ఉందన్నాడు. ఈ చిత్రం తన కెరీర్ లో మంచి మూవీగా నిలిచి పోవడం ఖాయమన్నాడు ధనుష్.
ఈ సినిమాలో నటించడంతో తనకు మరింత సంతృప్తిని కలిగించిందని చెప్పాడు. ఇదే సమయంలో కుబేరలో తన పాత్ర భిక్షగాడి పాత్ర అంటూ రివీల్ చేశాడు. గతంలో విజయవంతమైన సినిమాలు తీశాడు శేఖర్ కమ్ముల. తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగి ఉండడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. కనీసం రూ. 40 కోట్ల దాకా వసూలు చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
