Jayaram : మలయాళ నటుడు జయరామ్ కుమార్తె మాళవిక జయరామ్ వివాహం సింపుల్ గా జరిగింది. నవనీత్ గిరీష్‌తో కలిసి ఆమె 7 అడుగులు నడిచింది. కేరళలోని గురువాయూర్‌లోని ఓ ఆలయంలో సంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి ఫోటోలు విడుదలైన తర్వాత, నెటిజన్లు మరియు అభిమానులు నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
Jayaram Daughter Marriage..
మే 3న సినీ తారల రిసెప్షన్ గ్రాండ్ గా జరగనుంది. గిరీష్ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. జయరామ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తూ అలరించారు. తాజాగా గుంటూరు కారం సినిమాలో మహేష్ తండ్రిగా నటించాడు. ప్రస్తుతం పలు తెలుగు సినిమాల షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.
Also Read : Samantha : సాయి పల్లవిపై కీలక వ్యాఖ్యలు చేసిన సామ్..