Mahesh Babu : దర్శక ధీరుడు జక్కన్న దర్శకత్వం వహిస్తున్న ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో బిజీగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబుకు కోలుకోలేని షాక్ తగిలింది. ఇటీవలే సమ్మర్ వెకేషన్ కోసం విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చాడు. ఆ వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఈడీ) కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా పని చేశాడు. ఇందు కోసం ఏకంగా ఆ సంస్థల నుంచి రూ. కోట్ల కు పైగానే తీసుకున్నాడని గుర్తించింది ఈడీ. ఇది పూర్తిగా మనీ లాండరింగ్ కిందకే వస్తుందని రంగంలోకి దిగింది.
Mahesh Babu Summoned By ED
ఈ మేరకు మహేష్ బాబు(Mahesh Babu)కు నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఆయనకు సమన్లు కూడా జారీ చేసింది ఈడీ. ఏప్రిల్ 28న తమ ముందు విచారణకు హాజరు కావాలని అందులో స్పష్టం చేసింది. లేక పోతే తీవ్ర చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. దీంతో మనోడు ఇంకా స్పందించ లేదు. చాలా మంది టాలీవుడ్ కు చెందిన హీరో, హీరోయిన్లు పెద్ద ఎత్తున ఆయా సంస్థలకు ప్రచారం చేస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తూ వస్తున్నారు. ఈ తరుణంలో మహేష్ బాబుకు నోటీసులు రావడంతో దెబ్బకు గిల గిల కొట్టుకుంటున్నారు.
ఇదిలా ఉండగా ఏప్రిల్ 27ననే హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లలో పేర్కొంది. కానీ ఆరోజు ఆదివారం కావడంతో దానికి కోర్టు ఒప్పుకోదు. అందుకే విచారణ షెడ్యూల్ ను ఏప్రిల్ 28న సోమవారంకు మార్చారు. ఆరోజు ఉదయం 11 గంటలకు హాజరు కావాలని స్పష్టం చేసింది ఈడీ. అయితే మహేష్ బాబు సురానా, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు. ఆయన కుటుంబీకులు కూడా తెగ ప్రచారం చేశారు. ఈ రెండింటి సంస్థలకు పని చేసినందుకు ఏకంగా మహేష్ బాబు రూ. 11 కోట్లకు పైగా అందుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఈ రెండు సంస్థలపై ఈడీ సోదాలు చేపట్టింది.
Also Read : Popular Singer S Janaki Birthday : కోయిలమ్మ కలకాలం వర్ధిల్లవమ్మ