Hero Nani-Director Sujith :డైరెక్ట‌ర్ సుజీత్ తో నాని మూవీ క‌న్ ఫ‌ర్మ్ 

భారీ బ‌డ్జెట్ తో యాక్ష‌న్ ఓరియెంటెడ్ సినిమా

Nani : టాలీవుడ్ లో నేచుర‌ల్ స్టార్ గా గుర్తింపు పొందిన న‌టుడు, నిర్మాత నాని. త‌ను తీసిన కోర్ట్ బిగ్ హిట్ గా నిలిచింది. ఇదే స‌మ‌యంలో ది ప్యార‌డైజ్ , హిట్ 3 మూవీస్ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. త‌ను బిజీగా మారి పోయాడు. న‌టుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను నిల‌బెట్టుకుంటూనే ఇంకో వైపు నిర్మాణ సార‌థ్యంలోకి అడుగు పెట్టాడు. తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు నాని. ఓజీ ద‌ర్శ‌కుడు సుజీత్ తో తాను కొత్త ప్రాజెక్టుకు ఓకే చెప్పిన‌ట్లు స్ప‌ష్టం చేశాడు. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.

Nani Movie with Director Sujith

ఓ వైపు సుజీత్ ఇంకో వైపు నాని(Nani) త‌మ త‌మ రంగాల‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య సినిమా ఉంటుందా లేదా అన్న అనుమ‌నాల‌కు తెర దించే ప్ర‌య‌త్నం చేశాడు. హిట్ 3 మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేశాడు. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమా చూడాల‌ని న‌చ్చ‌క పోతే టికెట్ ధ‌ర తిరిగి ఇచ్చేస్తామంటూ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. మూవీ ప‌ట్ల , క‌థ ప‌ట్ల త‌న‌కు ఉన్న న‌మ్మ‌కాన్ని ఇది తెలియ చేస్తుంది.

ఈ సంద‌ర్బంగా న‌టుడు నాని మ‌రోసారి ధ్రువీక‌రించాడు. సుజీత్ తో త‌ప్ప‌కుండా సినిమా ఉంటుంద‌న్నాడు. ఇప్ప‌టికే ప్ర‌క‌టించ‌డం జ‌రిగింది. ఒక్క‌సారి క‌మిట్ అయితే నా మాట నేను విన‌ను అన్నాడు. ది ప్యార‌డైజ్ షూటింగ్ శ‌ర‌వేగంగా కొన‌సాగుతోంది. ఇది పూర్త‌యిన వెంట‌నే కొత్త ప్రాజెక్టు షూటింగ్ మొద‌ల‌వుతుంద‌ని, అది సుజీత్ తోనే ఉంటుంద‌న్నాడు నేచుర‌ల్ స్టార్. సో ఈ ఇద్ద‌రి నుంచి  భారీ బ‌డ్జెట్ తో మూవీ రానుంద‌న్న‌మాట‌.

Also Read : Nazriya Nazim Sensational : న‌జ్రియా న‌జీమ్ కు స‌మంత స‌పోర్ట్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com