చాలా గ్యాప్ తర్వాత నారా రోహిత్ తన మనసులోని మాటను బయట పెట్టారు. తను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఓజీలో నటిస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా నారా రోహిత్ స్పందించాడు. తన జీవితంలో ఒక్కసారైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని కలగా ఉండేదని, ఎప్పుడు నెరవేరుతుందా అని చాన్నాళ్ల పాటు నిరీక్షించానని అన్నాడు.
తాజాగా తన పాత్రకు సంబంధించిన, నటించబోయే సినిమా గురించి ముచ్చటించాడు చిట్ చాట్ సందర్బంగా . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జయకృష్ణ దర్శకత్వంలో హరి హర వీరమల్లులో నటించాడు. ఈ చిత్రాన్ని ఎంఎం రత్నం నిర్మించాడు. దీనిని జూన్ 12న రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే కీలక ప్రకటన చేశారు మూవీ మేకర్స్. ఇదే సమయంలో ఓజీ నుంచి కూడా అనౌన్స్ మెంట్ వచ్చేసింది. సెప్టెంబర్ నెలలో ఓజీని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో పవన్ స్టార్ తో పాటు నారా రోహిత్ కూడా నటిస్తున్నాడని దర్శకుడు వెల్లడించాడు. దీనిపై స్పందించాడు నారా రోహిత్. తన జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఏదైనా ఉందంటే అది ఓజీనేనని పేర్కొన్నాడు. కొన్నేళ్ల కల నెరవేరినందుకు సంతోషంగా ఉందని, మాటల్లో చెప్పలేనని అన్నాడు.
ఇందులో తనకు కీలకమైన పాత్ర ఇచ్చినందుకు మూవీ మేకర్స్ కు తాను రణపడి ఉంటానని స్పష్టం చేశాడు నారా రోహిత్. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఆసక్తిని రేపాయి. ఇక నారా రోహిత్ ఎవరో కాదు ఏపీ సీఎం చంద్రబాబుకు సోదరుడి కుమారుడు.
