Nikhil : నటి లావణ్య , రాజ్ తరుణ్ కేసు కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి సంచలన ఆరోపణలు చేసింది లావణ్య. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200కు పైగా ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, ఇందులో చాలా మంది ప్రముఖులు ఉన్నట్లు ఆరోపించింది. ఇందులో టాలీవుడ్ నటుడు నిఖిల్ సిద్దార్థ(Nikhil)కు సంబంధించిన వీడియోలు ఉన్నాయంటూ బాంబు పేల్చింది.
Hero Nikhil Siddharth Slams..
ఈ సందర్బంగా తీవ్రంగా స్పందించాడు నటి లావణ్య చేసిన కామెంట్స్ పై హీరో నిఖిల్. ఇది పూర్తిగా అబద్దమని, కావాలని తనను బద్నాం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ వాపోయాడు. ఇది మంచి పద్దతి కాదన్నాడు. తనకు సినీ కెరీర్ ముఖ్యమని, ఇలాంటి చిల్లర మల్లర వ్యవహారాలలో పాలు పంచుకునే ప్రసక్తి లేదని స్పష్టం చేశాడు.
వ్యక్తిగతంగా తనను డ్యామేజ్ చేసేందుకు నటి లావణ్య ప్రయత్నించడం తనను విస్తు పోయేలా చేసిందని వాపోయాడు. లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకుని ఫేక్ వీడియోలను సృష్టించడం తప్ప చేసింది ఏమీ లేదన్నాడు. ఈ కేసు విచారణ జరుగుతోందని, త్వరలోనే ఎవరు ఏమిటనేది తేలుతుందన్నారు నిఖిల్ సిద్దార్థ్.
Also Read : PM Modi Praise- Legendary :అరుదైన నటుడు అక్కినేని నాగేశ్వర్ రావు
