పాన్ ఇండియా హీరో ప్రభాస్ కెరీర్ ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది. తనతో సినిమాలు చేసేందుకు దర్శక, నిర్మాతలు క్యూ కడుతున్నారు. కానీ తను ఎవరికీ ఓకే చెప్పడం లేదు. ప్రస్తుతం డైనమిక్ డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డితో స్పిరిట్ చేయనున్నాడు. ఇప్పటికే పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. ఇక వంగా టేకింగ్ మేకింగ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తాజాగా మారుతి దర్శకత్వంలో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ అయ్యింది. ఊహించని బజ్ వచ్చింది.
అయితే రాజా సాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకనో మూవీ మేకర్స్ దీనిపై నోరు విప్పలేదు. మారుతి కథ, చిత్రీకరణపై కొంత గుర్రుగా ఉన్నట్లు టాక్. కానీ అవేవీ పట్టించుకోకుండా తన పని చేసుకుంటూ పోయాడు దర్శకుడు. ఇందుకు తగ్గట్టుగానే టీజర్ కెవ్వు కేక అనిపించేలా ఉండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. రాజా సాబ్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఇదే సమయంలో హను రాఘవపూడి చిత్రంలో కూడా నటిస్తున్నాడు ప్రభాస్.
దీంతో రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఇంకా కీలకమైన సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించాల్సి ఉందని ఇప్పటికే ప్రకటించాడు దర్శకుడు మారుతి. ఇటీవలే సమ్మర్ వెకేషన్స్ కోసం వెళ్లి తిరిగి వచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం తను బిజీగా ఉన్నాడు. ఇక రాజా సాబ్ కు సంబంధించి ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్స్ పట్ల చర్చ జరుగుతోంది. ఇందులో ద్విపాత్రిభినయం చేశాడని, కానీ తనకు నచ్చక పోవడంతో తన స్థానంలో సంజయ్ దత్ పెద్ద రాజాగా వచ్చినట్లు టాక్. మొత్తంగా ప్రభాస్ డ్యూయల్ రోల్ పట్ల అంతగా ఆసక్తి చూపనట్లు సమాచారం.
