Rajendra Prasad : టాలీవుడ్ లో ఈ మధ్య కాంట్రావర్సీ కామెంట్స్ చేయడం ఆ తర్వాత సారీ చెప్పడం అలవాటుగా మారింది. తాజాగా అగ్ర నటుడు రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) నోరు జారారు. ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకున్నాడు. సభ్య సమాజం సిగ్గు పడేలా తను కామెంట్స్ చేయడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. దీంతో మనోడు దిగి వచ్చాడు. మంగళవారం స్వయంగా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆపై తాను డేవిడ్ వార్నర్ కు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు.
Rajendra Prasad Says Sorry to David Warner
వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ రెడ్డి, శ్రీలీల, కేతికా శర్మ, క్రికెటర్ డేవిడ్ వార్నర్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్బంగా మూవీకి సంబంధించిన ట్రైలర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్బంగా ఇందులో నటించిన రాజేంద్ర ప్రసాద్ స్టేజీ పైకి రాగానే డేవిడ్ వార్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడిన దాంట్లో ఎక్కువగా తనపైనే కామెంట్స్ చేయడం ప్రేక్షకులను విస్తు పోయేలా చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల కానుంది. దీంతో పాటు మ్యాడ్ 2 కూడా అదే రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో ఇప్పటికే రాబిన్ హుడ్ లో అదిదా సర్ ప్రైజ్ అంటూ స్పెషల్ సాంగ్ లో కేతికా శర్మ నటించింది. ఇది పూర్తిగా వివాదాస్పదంగా మారింది. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేశారు. పూర్తిగా మహిళలు సిగ్గుపడేలా ఉందని విమర్శలు వచ్చాయి. దీనిపై సీరియస్ గా స్పందించింది తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద. గీత దాటితే నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ తరుణంలో రాజేంద్ర ప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. చివరకు తప్పైందంటూ చెప్పడం గమనార్హం.
Also Read : Hero Sandeep Kishan-Mazaka :జీ5 ఓటీటీలో మజాకా మూవీ
