తమిళ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరో సిలాంబరసన్. తన తండ్రి ఫేమస్ డైరెక్టర్ . అయితే తను ఈ మధ్యన నటి నిధి అగర్వాల్ తో డేటింగ్ చేస్తున్నాడని, పీకల లోతు ప్రేమలో కూరుకు పోయాడని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిని ఖండించాడు నటుడు. తాజాగా తను కొత్త ప్రాజెక్టులో కీ రోల్ పోషించాడు. దిగ్గజ దర్శకుడు , హీరో, హీరోయిన్లకు ఆరాధ్య దైవమైన మణిరత్నం దర్శకత్వంలో నటించాడు. ఆ చిత్రమే కమల్ హాసన్ కథ కూర్చిన థగ్ లైఫ్. పూర్తిగా దొంగల నేపథ్యం గురించిన సినిమా.
ఇక మణిరత్నం సినిమా పరంగా రత్నమే. తన టేకింగ్ మేకింగ్ ఇతర దర్శకుల కంటే భిన్నంగా ఉంటుంది. తను గత ఏడాది తీసిన పొన్నియన్ సెల్వన్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వందల కోట్లు కుమ్మరించింది. ఇక ఇలయ నాయగన్ కు భారీ ఎత్తున ఆదరణ ఉంది. తన స్టార్ ఇమేజ్ కు తోడు అందాల ముద్దుగుమ్మ త్రిష కృష్ణ న్ కూడా తోడైంది. విచిత్రం ఏమిటంటే మణిరత్నం, కమల్ కాంబినేషన్ లో చాలా గ్యాప్ తర్వాత అంటే 38 ఏళ్ల అనంతరం వస్తున్న చిత్రం ఇది. దీంతో దీనిపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు కమల్ .
ఇందులో నటించిన వారంతా సక్సెస్ పక్కా అని నమ్ముతున్నారు. చెన్నైలో థగ్ లైఫ్ ఆడియో లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా తన మనసులోని మాటను బయట పెట్టాడు హీరో సిలాంబరసన్. ఒకరు మణిరత్నం మరొకరు ఏఆర్ రెహమాన్ కు తాను ఎల్లప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. తను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చి మణిరత్నం నిలబెట్టాడని గుర్తు చేసుకున్నాడు. ఇక అద్భుతమైన పాటలను ఇచ్చి తనకు మరో లైఫ్ ఇచ్చాడంటూ రెహమాన్ గురించి ప్రశంసలు కురిపించాడు. తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ ను ఆకట్టుకునేలా చేశాయి.