కొడుక్కి కాదు ఆక‌లితో ఉన్న వాళ్ల‌కు ఛాన్స్ ఇస్తా

క‌న్న‌డ స్టార్ హీరో య‌శ్ త‌ల్లి కామెంట్స్

హైద‌రాబాద్ – క‌న్న‌డ సూప‌ర్ స్టార్ య‌శ్ త‌ల్లి పుష్ప సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌ను నిర్మాత‌గా మారారు. ఓ సినిమా కూడా తీశారు. ఈ సంద‌ర్బంగా హైద‌రాబాద్ కు వ‌చ్చిన ఆమె త‌న కొడుకు గురించి చెప్పిన మాట‌లు ఇప్పుడు దేశ వ్యాప్తంగా వైర‌ల్ అయ్యాయి. ఒక‌రి గురించి ఆలోచించ‌కండి. ప‌ని చేయ‌డంపై దృష్టి పెట్టండి. ఎవ‌రో వ‌చ్చి మ‌న‌కు అవ‌కాశాలు ఇస్తార‌ని అనుకోవ‌ద్ద‌ని, అలా ఆలోచించ‌డం పూర్తిగా విరుద్ద‌మ‌ని పేర్కొంది. ఈ సంద‌ర్బంగా కొడుకు గురించి మాట్లాడుతూ య‌శ్ తో తాను సినిమాలు చేయ‌బోనంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది.

ఎందుక‌ని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు దిమ్మ తిరిగేలా స‌మాధానం ఇచ్చింది. నా కొడుకు ఇవాళ పాన్ ఇండియా స్థాయిలో స్థార్ హీరో. త‌న‌కు లెక్క‌కు మించిన డ‌బ్బులు ఉన్నాయి. అంటే త‌ను బ‌తికేందుకు కావాల్సినంత సంప‌ద ఉంది. త‌న‌తో సినిమా తీస్తే ఏం వ‌స్తుందంటూ ప్ర‌శ్నించింది. క‌డుపు నిండిన వాళ్ల‌కు సాయం చేస్తే మ‌రింత సోమ‌రిత‌నంతో ఉండి పోతార‌ని పేర్కొంది. అదే క‌డుపు మండుతున్న వాళ్ల‌కు, ఆక‌లితో ఉన్న వాళ్ల‌కు అవ‌కాశాలు ఇస్తే వారు మ‌రింత‌గా రాణించేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు పుష్ప‌.

ఇదిలా ఉండ‌గా య‌శ్ కూడా చాలా క‌ష్ట ప‌డ్డాడ‌ని, వాడు కూడా ఎవ‌రిపై ఆధార‌ప‌డే మ‌న‌స్త‌త్వం కాద‌ని చెప్పింది. జీవితంలో క‌ష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బుల‌కు, నీతి, నిజాయితీతో ఉన్న వాళ్ల‌కే విలువ ఎక్కువ‌గా ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది య‌శ్ త‌ల్లి. ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో ఈ ఒక్క వీడియో మిలియ‌న్స్ వ్యూస్ తీసుకు వ‌చ్చేలా చేసింది. ఏ త‌ల్లి అయినా ఆమెను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ పేర్కొంటున్నారు నెటిజ‌న్లు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com