అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అడపా దడపా సినిమాలు చేస్తూనే వస్తోంది. తన కెరీర్ గురించి వస్తున్న అనుమానాలకు, కామెంట్స్ కు తీవ్రంగా స్పందించింది లవ్లీ బ్యూటీ. ఇక నుంచి సినిమా పరంగా గ్యాప్ అనేది తీసుకోనంటూ స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా తన సినీ కెరీర్ అక్కినేని నాగార్జునతో స్టార్ట్ చేసింది. తనను ఏరికోరి ఎంపిక చేశాడు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఆ సినిమానే సూపర్. అది బిగ్ హిట్ గా నిలిచింది.
ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. టాప్ హీరోలతో నటించింది. మాస్ మహరాజాతో విక్రమార్కలో నటించింది అనుష్క శెట్టి. దీనికి దర్శకత్వం వహించాడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ తర్వాత డార్లింగ్ ప్రభాస్ తో బాహు బలి తీశాడు. ఇది దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ వసూళ్లను సాధించింది. ఇందులో కీ రోల్ పోషిస్తోంది అనుష్క శెట్టి.
ఇక తన స్వస్థలం కర్ణాటక. తన అసలు పేరు స్వీటీ శెట్టి. ఒకానొక సమయంలో టాప్ హీరోయిన్ గా నిలిచింది. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ మూవీస్ లో నటించింది. ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆ మధ్యన యువ నటుడితో కూడా జత కట్టింది. ఈ మధ్యన తన కెరీర్ లో ఎందుకు గ్యాప్ వచ్చిందంటూ ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది . ఇక నుంచి కెరీర్ పరంగా శ్రద్ద తీసుకుంటానని, గ్యాప్ అనేది ఉండదన్నారు.
