Janhvi Kapoor : కోట్లాది మంది మహిళలు నిత్యం ఎదుర్కొనే అతి పెద్ద సమస్య రుతుస్రావం (పీరియడ్స్) . ఇది అత్యంత సహజం. ప్రకృతి పరంగా స్త్రీలకు సహజ సిద్దంగా వచ్చేదే. దీనిని కొందరు లైట్ గా తీసుకుంటే మరికొందరు సీరియస్ గా తీసుకుంటున్నారు. అయితే సమాజంలో రాను రాను పెను మార్పులు వచ్చాయి. గతంలో సంప్రదాయ కుటుంబాలలో యువతులు, బాలికలు, మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించేవారు. వారిని దూరంగా ఉంచే వాళ్లు. ప్రతి నెలా నెలా పీరియడ్స్ వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటారు.
Janhvi Kapoor Shocking Comments
ప్రత్యేకించి మానసికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. దీని నుంచి ఉపశమనం పొందేందుకు నానా తంటాలు పడుతుంటారు.ఇదే సమయంలో నాలుగైదు రోజులు ఈ రుతుస్రావం వస్తూ ఉంటుంది. ఇందు కోసం ప్యాడ్స్ వాడతారు. ప్రతి రంగంలో ఇప్పటికీ పీరియడ్స్ అంటేనే ఓ చులకన భావం ఉందని మహిళలు వాపోతున్నారు. ఇది ఎక్కువగా చలన చిత్ర పరిశ్రమలో ఉంటోంది. తెరపై తమ తళుకు బెళుకులతో , డ్యాన్సులతో , నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న సినీ నటీమణులు ఎక్కువగా ఫేస్ చేస్తున్నారు.
ఒకానొక సమయంలో ఇబ్బంది పడుతూనే షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తోందని వాపోతున్నారు . తాజాగా బాలీవుడ్ కు సంబంధించిన టాప్ హీరోయిన్లు సమంత రుత్ ప్రభుతో పాటు జాన్వీ కపూర్(Janhvi Kapoor) పీరియడ్స్ విషయంపై స్పందించారు. జాన్వీ ప్రత్యేకంగా ప్రస్తావించింది రుతుస్రావం గురించి. ప్రతి నెలా వచ్చే దీని గురించి ఎంత చెప్పినా తక్కువేనని పేర్కొంది. కొందరు తమను అర్థం చేసుకుంటే మరికొందరు దారుణంగా మాట్లాడతారంటూ వాపోయింది. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన మానసిక ఆందోళన ఉంటుందని తెలిపింది. తమను అర్థం చేసుకుని ఆదరించాలని కోరింది ఈ ముద్దుగుమ్మ.
Also Read : Beauty Kajal Aggarwal Special Song :పెద్ది చిత్రంలో కాజల్ స్పెషల్ సాంగ్ ..?