హమ్మయ్య ఊపిరి పీల్చుకుంది లవ్లీ బ్యూటీ కేతికా శర్మ. తను నటించిన తాజా చిత్రం శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ నటించిన సింగిల్ మూవీ సూపర్ టాక్ తో దూసుకు పోతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మూవీ మేకర్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. ఇక ఇందులో ఓ పాత్ర పోషించింది అందాలను ఆర బోసిన కేతికా శర్మ. తను సినీ ఇండస్ట్రీలోకి 2021లో ప్రవేశించింది. రొమాంటిక్ మూవీ ద్వారా పరిచయం అయ్యింది.
విడుదలైన ఆ చిత్రం అంతగా ఆకట్టులేదు. అప్పటి నుంచి అడపా దడపా చేస్తూనే వస్తోంది కేతికా శర్మ. రొమాన్స్ పండించడం, అందాలను ఆర బోయడంలో ఎలాంటి అభ్యంతరాలు చెప్పక పోవడంతో నటికి కొన్ని ఛాన్స్ లు దక్కాయి. రొమాంటిక్ తర్వాత బ్రో, రంగరంగ వైభవంగా , లక్ష్య చిత్రాలలో నటించింది.
ఇదే సమయంలో రాబిన్ హుడ్ లో స్పెషల్ సాంగ్ లో సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇదిదా అంటూ పాటకు డ్యాన్సు తో హోరెత్తించింది. ఇది వివాదాస్పదమైంది.
దీంతో కేతికా శర్మ ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇది ఒక రకంగా తనకు కలిసి వచ్చిందని చెప్పక తప్పదు. ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చింది సింగిల్ కూడా సూపర్ సక్సెస్ కావడం, కలెక్షన్స్ రావడంతో ఇందులో తను నటించిన పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఊపిరి పీల్చుకుంది ముద్దుగుమ్మ. నటనా పరంగా ప్రశంసలు రావడంతో తెగ ముచ్చట పడుతోంది.
