టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కీలక ప్రకటన చేసినప్పటి నుంచి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. తను తీసే మూవీలో పవర్ ఫుల్ డైలాగులు తప్పకుండా ఉంటాయి. అందుకే ప్రేక్షకులు ఎగబడి చూస్తారు. తమను తాము అందులో ఊహించుకుంటారు. సాహిత్యానికి, పాటలకు కూడా ప్రయారిటీ ఉంటుంది. ఇక ఎలాంటి పాత్ర ఇచ్చినా దానికి వంద శాతం న్యాయం చేసే నటుల్లో ఒకరు విక్టరీ వెంకటేశ్. తను ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ ఏడాది ఆయనకు మంచి శుభారంభమే దక్కింది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూలు చేసింది. సినీ వర్గాలను విస్తు పోయేలా చేసింది. ఇందులో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కీ రోల్స్ పోషించారు. పూర్తిగా కామెడీ, హర్రర్ , రొమాన్స్ ఉండేలా చేశాడు. భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉంది. పాటలు కూడా జనాదరణ పొందాయి.
ఈ తరుణంలో తను చేయబోయే మూవీ గురించి ఓకే చెప్పాడు విక్టరీ వెంకటేశ్. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేయడం ఆనందంగా ఉందన్నాడు. ఈ సందర్బంగా పూర్తిగా కామెడీ, రొమాంటిక్ నేపథ్యంగా ఉండబోతోందంటూ చెప్పకనే చెప్పాడు డైరెక్టర్. సినిమా గురించి కీలక అప్ డేట్ వచ్చింది. తమిళ సినీ పరిశ్రమకు చెందిన టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న రుక్మిణి వసంత్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించాడు.