డ‌బ్బా కార్టెల్ సో బ్యూటిఫుల్ – సిమ్రాన్

స‌హ‌చ‌ర న‌టి జ్యోతిక న‌ట‌న‌పై కామెంట్స్

ప్ర‌ముఖ న‌టి సిమ్రాన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. త‌న స‌హ‌చ‌ర న‌టి జ్యోతికను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది. త‌మిళ సినీ రంగంలో ఇద్ద‌రూ కీ రోల్స్ పోషించారు. వేలాది మంది అభిమానుల మ‌న‌సు దోచుకున్నారు. జ్యోతిక న‌టుడు సూర్య‌ను పెళ్లి చేసుకుంది. త‌ను క‌థ‌కు త‌గిన‌ట్టు కొన్ని పాత్ర‌ల‌ను ఎంచుకుని న‌టిస్తోంది. తాజాగా వెబ్ సీరీస్ లో న‌టించింది.

ఆ సీరీస్ పేరు డ‌బ్బా కార్నెల్. ముంబైలో డ‌బ్బా వాలాల గురించి తెలియ‌ని వారంటూ ఎవ‌రూ ఉండ‌రు. ల‌క్ష‌లాది మందికి ఈ డ‌బ్బాలే ప్రాణాధారంగా నిలుస్తాయ‌న‌డంలో సందేహం లేదు. దాని ప్రాధాన్య‌త గురించి వెబ్ సీరీస్ గా వ‌స్తోంది. ఇందులో అద్భుతంగా కీల‌క‌మైన పాత్ర‌లో న‌టించింది జ్యోతిక‌. ఆమెతో పాటు బాలీవుడ్ కు చెందిన టాప్ న‌టీన‌టులు న‌టించారు.

ఈ సంద‌ర్బంగా డ‌బ్బా కార్నెల్ గురించి ప్ర‌శంస‌లు కురిపించింది న‌టి సిమ్రాన్. త‌ను గొప్ప న‌టి. అంత‌కు మించి స‌హృద‌య‌త క‌లిగిన స్నేహితురాలంటూ పేర్కొంది జ్యోతిక‌ను ఉద్దేశించి. ఆమె ఆత్మీయ‌త‌కే కాదు ఆక‌లిని గుర్తించి అన్నంపెట్టే విధానం కూడా గొప్ప‌గా ఉంటుంద‌ని తెలిపింది. ఇది కొంద‌రికి మాత్ర‌మే వ‌స్తుంద‌ని పేర్కొంది సిమ్రాన్. ఒక అవార్డు ప్ర‌ధానోత్స‌వ కార్య‌క్ర‌మంలో డ‌బ్బా పాత్ర గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించడం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

డ‌బ్బా కార్టెల్ వెబ్ సీరీస్ ల‌లో మంచి సీరీస్ గా పేర్కొంది సిమ్రాన్. ప్ర‌జ‌లు గొప్ప‌గా ఆద‌రిస్తుండ‌డం త‌న‌కు ఆనందం క‌లిగిస్తోంద‌న్నారు. కాగా అంధగన్‌లో ఆమె నెగటివ్ రోల్ కోసం సిమ్రాన్ అవార్డు గెలుచుకుంది. ఆమె అంగీకార ప్రసంగంలో “ఆంటీ పాత్రలు” పోషించినందుకు తోటి నటి తనను ఎగతాళి చేసిన సంఘటనను ఆమె గుర్తుచేసుకుంది.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com