Sonakshi : ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు కోపం వచ్చింది. తను ఏ మాత్రం సమయం ఉన్నా సోషల్ మీడియాను యూజ్ చేస్తుంది. గత కొంత కాలంగా ఆమె ట్రోల్ కు గురవుతోంది. తనకు సంబంధం లేని విషయాల గురించి తనను లాగడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. చాలా మంది సినీ రంగానికి చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతులు, ఇతర సాంకేతిక నిపుణులు ఎక్కువగా చాటింగ్ చేయడం, అభిప్రాయాలను పంచుకోవడం, ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటారు.
Sonakshi Sinha Shocking Comments on Divorce
తాజాగా సోనాక్షి సిన్హా(Sonakshi) గురించి ఓ నెటిజన్ ఆసక్తికర వ్యాఖ్య చేశాడు. తనకు కోపం తెప్పించేలా కామెంట్ చేయడంతో మండిపడింది. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవలే ఆమె మతాంతర వివాహం చేసుకుంది. తను ముస్లిం. ఆమె హిందువు. దీంతో ఈ ఇద్దరి పెళ్లి పట్ల కొంత వ్యతిరేకతను వ్యక్తం చేశారు ఫ్యాన్స్. దీని గురించి సోనాక్షి సిన్హా పెద్దగా పట్టించు కోలేదు. ఇవన్నీ సమాజంలో మామూలేనంటూ పేర్కొంది. వివాహం అనేది ఇద్దరికి సంబంధించిన అంశమని, దానిలో ఇంకొకరు జోక్యం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తెలిపింది.
ఇదే సమయంలో త్వరలోనే మీరు విడి పోతారంటూ నెటిజన్ చేసిన కామెంట్స్ పై సోనాక్షి సిన్హా కన్నెర్ర చేసింది. మా మధ్య అలాంటి ఆలోచనలు లేవు. ఒకవేళ ఉంటే , విడిపోతే ముందు మీ పేరెంట్స్ విడి పోకుండా చూసుకో అంటూ ఘాటుగా బదులు ఇచ్చింది. తాజాగా సోనాక్షి సిన్హా చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. నెట్టింట్లో వైరల్ గా మారాయి.
Also Read : Hero Kalyanram-Arjun s/o Vyjayanthi :అనుబంధానికి పెద్దపీట అర్జున్ సక్సెస్ బాట
