Sree Leela : తన నటనతో, డ్యాన్సులతో కిర్రాక్ తెప్పిస్తున్న నటి శ్రీలీల సంచలనంగా మారారు. సామాజిక మాధ్యమాలలో తను ట్రెండింగ్ లో కొనసాగుతున్నారు. ఓ వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే ఇంకో వైపు సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. చాలా మంది ఒకసారి స్టార్ డమ్ వస్తే చాలు జనాలకు దూరంగా ఉండాలని అనుకుంటారు. ఎక్కడ తమ ఇమేజ్ దెబ్బతింటోందనని ఆందోళన చెందుతారు. కానీ శ్రీలీల అలా కాదు. తను కూడా మీలాంటి మనిషినేనని చెప్పకనే చెబుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే నటీమణులలో తను కూడా ఒకరు.
Sree Leela Adopt..
తాజాగా శ్రీలీల(Sree Leela) సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కారణం ఏమిటంటే తను అనాధ పిల్లలను దత్తత తీసుకోవడం. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా తనే పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ శ్రీలీలను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. తను తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ..అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రతి ఒక్కరికి సామాజిక పరమైన బాధ్యత ఉండాలని దీనిని నిర్వహిస్తున్న శ్రీలీల ధన్యురాలంటూ పేర్కొంటున్నారు.
తన కుటుంబంలోకి నటి కొత్త బిడ్డను ఆహ్వానించింది. ఒక పసికందును కౌగిలించుకుంటున్న రెండు చిత్రాలను పంచుకున్నారు. పూర్తి వివరాలు తెలియక పోయినా తమ ఫ్యామిలీలో మరొకరు చేరారంటూ పేర్కొంది నటి శ్రీలీల. అయితే తను వెరీ స్పెషల్ గత కొంత కాలంగా చాలా మంది అనాథ శిశువులను , బాలికలను దత్తత తీసుకుని వారిని పెంచుతోంది. 23 ఏళ్ల శ్రీలీలకు పిల్లలంటే పంచ ప్రాణం. ప్రత్యేకించి ఎవరూ లేని అనాథలకు అన్నీ తాను కావాలని అనుకుంటోంది. హ్యాట్సాఫ్ శ్రీలీల.
Also Read : Hero Suriya Appeal : ధూమపానం ప్రమాదం ఆరోగ్యానికి హానికరం
