Varalaxmi Shocking Comment :లైంగిక వేధింపుల‌కు లోన‌య్యా

న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్

Varalaxmi Shocking Comment

Varalaxmi : త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్(Varalaxmi) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. తాను కూడా లైంగిక వేధింపుల‌కు గురైన‌ట్లు వాపోయింది. జీ త‌మిళ్ ఛాన‌ల్ లో రియాల్టీ షో డ్యాన్స్ షో సంద‌ర్బంగా త‌ను న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రించింది. ఈ సంద‌ర్బంగా తాను కూడా లైంగికంగా వేధింపులకు గురైన‌ట్లు వాపోయింది. త‌ను ఆనాడు అనుభ‌వించిన ఆ న‌ర‌కం గురించి క‌న్నీళ్లు పెట్టుకుంది. ఇదే స‌మ‌యంలో కెమీ అనే పార్టిసిపెంట్ బాల్యాన్ని గుర్తు చేసుకుంది.

Varalaxmi Shocking Comments

ఈ సంద‌ర్బంగా న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌రత్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా చిన్న‌ప్పుడు తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కొన్న‌ట్లు వాపోయింది. గుడ్ ట‌చ్ ..బ్యాడ్ ట‌చ్ అనేది త‌న‌కు అప్ప‌ట్లో తెలియ‌ద‌న్నారు. ఆ స‌మ‌యంలో త‌న‌ను ఐదారుగురు వేధింపులకు గురి చేసిన‌ట్లు క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. న‌టి వ‌ర‌లక్ష్మి ఎవ‌రో కాదు ప్ర‌ముఖ న‌టుడు శ‌ర‌త్ కుమార్ గారాల ముద్దుల కూతురు. ఇటీవ‌ల ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో అంత అందంగా లేని వ్య‌క్తిని పెళ్లి చేసుకుంది.

త‌న పేరెంట్స్ సినిమా రంగంలోకి రాక ముందు ఉద్యోగాలు చేసే వారు. త‌న‌ను వేరే వాళ్ల వ‌ద్ద విడిచి పెట్టే వెళ్లే వారు. ఇదే స‌మ‌యంలో త‌నను దారుణంగా ఇబ్బంది పెట్టార‌ని, చెప్ప‌రాని చోట తాకారాని, వేధింపుల‌కు గురి చేశారంటూ వాపోయింది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్. ఈ సంద‌ర్బంగా పేరెంట్స్ కు కీల‌క సూచ‌న‌లు చేసింది. పిల్ల‌ల ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించింది న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్.

Also Read : Hero Salmaan Khan-Sikandar :స‌ల్మాన్ ఖాన్ సికంద‌ర్ కు భారీ డిమాండ్

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com