Major : శశి కిరణ్ టిక్కా దర్శకత్వం వహించిన అడవి శేష్ కీ రోల్ పోషించిన చిత్రం మేజర్(Major). దేశ వ్యాప్తంగా ఈ సినిమాకు మంచి బజ్ వచ్చింది. బిగ్ సక్సెస్ గా నిలిచింది. దీనిని సోనీ పిక్చర్స్ తో పాటు ప్రిన్స్ మహేష్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై సంయుకత్ంగా నిర్మించారు. అంచనాలకు మించి అద్బుత విజయాన్ని నమోదు చేసింది. పాన్ ఇండియా లెవల్లో రికార్డ్ బ్రేక్ చేసింది. సూపర్ కలెక్షన్స్ వసూలు చేయడంతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Adivisesh Major Movie
ఇక భారతీయ సినిమాలకు ఇతర దేశాలలో భలే డిమాండ్ ఉంటుంది. చైనా, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, దుబాయ్, తదితర దేశాలలో మన తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తుంటారు. ఈ మధ్యనే జపాన్ కు వెళ్లాడు జూనియర్ ఎన్టీఆర్. అక్కడి వారితో మాట్లాడాడు. తను నటించిన దేవర మూవీని అక్కడ ప్రదర్శించారు. ఇదే సమయంలో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ బయోపిక్ గా మేజర్ ను రూపొందించాడు అద్భుతంగా దర్శకుడు శశి కిరణ్ టిక్కా. చూసిన వారందరూ కంట తడి పెట్టారు.
విధి నిర్వహణలో మేజర్ ఎలా అమరుడయ్యాడో తెర మీద కళ్లకు కట్టినట్లు చూపించాడు. అడవి శేష్ తో పాటు ప్రకాశ్ రాజ్ సాయి మంజ్రేకర్, శోభిత, రేవతి ప్రధాన పాత్రల్లో నటించారు. గుండెలను హత్తుకున్నారు. అయితే సినిమాను మార్కెట్ చేసుకునేందుకు కాకుండా మన సంస్కృతిని పరిచయం చేసేందుకు, మేజర్ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు మూవీ మేకర్స్. ఇందులో భాగంగా ఏప్రిల్ 29న మన భారతీయ కాలమాన ప్రకారం మూవీ స్క్రీనింగ్ కానుంది.
Also Read : దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కచేరికి నో ఛాన్స్
