AICC Chief Kharge : కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్ ఉగ్ర దాడి, ఆపరేషన్ సిందూర్ , భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందాలకు సంబంధించి చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం ఏఐసీసీ చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా వీటన్నింటిని చర్చించేందుకు గాను అఖిలపక్షం సమావేశంతో పాటు పార్లమెంట్ సెషన్ నిర్వహించాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని డిమాండ్ చేశారు. యావత్ భారత దేశమంతా కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇచ్చిందన్నారు.
AICC Chief Kharge Comments
ఈ తరుణంలో జాతి ప్రజలకు అసలు వాస్తవాలు ఏమిటో తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు తనతో పాటు అగ్ర నేత రాహుల్ గాంధీ కలిసి లేఖ రాయడం జరిగిందని చెప్పారు మల్లికార్జున్ ఖర్గే(AICC Chief Kharge). ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎందుకు అమెరికా జోక్యం చేసుకుందో చెప్పాలన్నారు. ఒక దేశానికి సంబంధించి ఇంకో దేశం ఎందుకు ఇన్ వాల్వ్ అవుతుందో వివరించాల్సిన బాధ్యత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉందని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ, ఖర్గే.
మీ అంతకు మీరే కాళ్ల బేరానికి వెళ్లారా. లేక ట్రంప్ ను సయోధ్య కుదర్చమని కోరారా అన్నది తేలాలన్నారు. ఈ సందర్బంగా 1981లో ఇండియాకు ఐఎంఎఫ్ 5.8 బిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించిందని చెప్పారు జైరాం రమేష్. ఆనాడు యుఎస్ తీవ్ర అభ్యంతరం తెలిపిందన్నారు. ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశానికి దూరంగా ఉందన్నారు. ఆనాడు పీఎం ఇందిరను ఒప్పించిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read : Minister Rajnath Singh Shocking :ఆపరేషన్ సిందూర్ తో సత్తా ఏమిటో చూపించాం