బాలీవుడ్ సుందరాంగి, సోగకళ్లతో మెస్మరైజ్ చేసే బ్యూటీ ఫుల్ లేడీ యాక్టర్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ సంచలనంగా మారారు. తను కేన్స్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిశారు. ప్రధాన ఆకర్షణగా నిలిచారు. తనను ఏరికోరి చేసుకున్నాడు బిగ్ బి తనయుడు అభిషేక్ బచ్చన్. ఈ మధ్యన కొన్ని పుకార్లు షికార్లు కూడా చేశాయి. తనతో వేరుగా ఉంటోందని, ఇంకొకరితో డేటింగ్ చేస్తోందని, విడాకుల దాకా కథ వచ్చిందని ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటిని కొట్టి పారేస్తూ నిండు సింధూరం ధరించి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అందరినీ తన వైపు తిప్పుకునేలా చేసింది.
మెస్మరైజ్ చేసే అందంతో పాటు ఆకట్టుకునేలా దుస్తులు ధరించింది ఐశ్వర్య రాయ్ బచ్చన్. తను ఏది చేసినా సంచలనమే. భారతీయత ఉట్టి పడేలా వస్త్రధారణ ఉండడంతో అందరూ ఆమెను తదేకంగా చూస్తూ ఉండి పోయారు. ఇదే సమయంలో ఇటీవల భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తత నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ పేరుతో మిషన్ మొదలు పెట్టింది. పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది.
దీంతో సిందూరం అనేది ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఓ సినిమా కూడా రాబోతోంది. ఈ టైటిల్ ను కైవసం చేసుకునేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. ఇది పక్కన పెడితే సింధూరం ధరించిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ తాను పూర్తి గా భారతీయురాలినని యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు. దేశం ముందు సినిమా తర్వాత అని ప్రకటించారు . ఇప్పుడు ఎక్కడ చూసినా ఐశ్వర్య ఫోటోలు, వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి.