Ajith Kumar Looks : తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల్లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు అజిత్ కుమార్. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అంతా తనను తలా అని పిలుచుకుంటారు. ఎక్కువగా పబ్లిసిటీని ఇష్ట పడని ఈ నటుడు లో ప్రొఫైల్ ఉండేలా జాగ్రత్త పడతాడు.
Ajith Kumar Looks Trending
కేవలం నటనపైనే ఎక్కువగా ఫోకస్ పెడతాడు. తనకు ఇచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడతాడు. అందుకే అజిత్ కు(Ajith Kumar) మినిమం గ్యారెంటీ ఉన్న నటుడిగా పేరు వచ్చింది. తాజాగా ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ విదా ముయార్చికి ప్లాన్ చేసింది. ఇప్పటికే నటీ నటులు కూడా ఖరారై పోయారు.
షూటింగ్ అబుదాబిలో మొదలు కానుంది. ఈ తీయబోయే చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. కథ, స్క్రీన్ ప్లే కూడా తనే కావడం విశేషం. అజిత్ కుమార్ తో పాటు ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ , తమిళ బ్యూటీ త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందజేస్తున్నాడు. తను ఇప్పటి వరకు అందించిన సినిమాలన్నీ బిగ్ హిట్ గా నిలిచాయి. తాజాగా నెల్సన్ తీసిన జైలర్ రూ. 600 కోట్లు సాధించింది. మరి ఈ మూవీ ఇంకెంత సక్సెస్ అవుతుందో చూడాలి.
Also Read : Ayushmann Khurana : అట్లీతో మూవీ చేయాలని ఉంది
