Good Bad Ugly : యువ దర్శకుడు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఇది ఊహించని రీతిలో సక్సెస్ అయ్యింది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది. ఏకంగా రూ. 200 కోట్ల మార్క్ ను దాటేసింది కలెక్షన్ల పరంగా. ఇందులో ప్రముఖ నటుడు అజిత్ కుమార్ , అందాల తార త్రిష కృష్ణన్ కీ రోల్స్ పోషించారు. దీనిని దర్శకుడు పూర్తిగా యాక్షన్, కామెడీ థ్రిల్లర్ గా రూపొందించాడు. అన్ని వర్గాల ప్రజలు ఈ సినిమాను అక్కున చేర్చుకున్నారు. ఆదరించారు. దీంతో మూవీ మేకర్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు.
Good Bad Ugly Movie OTT Updates
అంతే కాదు చిత్రంలో ముఖ్య భూమికను పోషించిన అజిత్ కుమార్ కు కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ ను అందజేసింది. ఈ సందర్బంగా ఈ ఏడాదిలో తనకు సంబంధించి రెండు చిత్రాలు రిలీజ్ అయ్యాయి. విదాముయార్చి ఆశించిన రీతిలో ఆడలేదు. ఇందులో అజిత్ తో పాటు త్రిష కృష్ణన్ నటించింది. కానీ అనుకోకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly) సూపర్ హిట్ టాక్ ను అందుకుంది. ఇది ఒక రకంగా అజిత్ కు ఊపిరి పీల్చుకునేలా చేసింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఓ ప్రత్యేకత ఉంది. టాలీవుడ్ లో బబిగ్ నిర్మాణ సంస్థగా పేరు పొందిన మైత్రీ మూవీ మేకర్స్ తొలిసారిగా తమిళ సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ తీశారు. వాళ్లు ఏది పట్టుకున్నా, ఏ సినిమా తీసినా అది బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. టాకీస్ లలో సూపర్ సక్సెస్ అయిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, అలరించేందుకు రెడీ అయ్యింది. ఈ విషయాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.
Also Read : Hero Mahesh Babu-SSMB29 :వారణాసిలో జక్కన్న..మహేష్ బాబు బిజీ