ఈ మధ్య అందాల ముద్దుగుమ్మలు నిరంతరం సంచలనంగా ఉండేందుకు ఇష్ట పడుతున్నారు. ఏది ఏమైనా సరే పాత్రలు వస్తే నటించేందుకు ఓకే అంటున్నారు. ఈ తరుణంలో మరో తార , అందాల ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె తాజాగా చేసిన కామెంట్స్ సినీ రంగంలో కలకలం రేపాయి. దీనికి కారణం ఏమిటంటే తను రొమాన్స్, ఇతర కీలక సన్నివేశాలలో నటించడం, అందాలను ఆర బోసేందుకు ఏ మాత్రం ఒప్పుకోనంటూ ముందు ప్రకటించింది.
కానీ ఎందుకనో మనసు మార్చుకుంది. ఇందుకు సంబంధించి తాను గ్లామరస్ పాత్రలకు ఓకే అని వెల్లడించింది. అయితే కొన్ని కండీషన్స్ కు మాత్రమే తాను ఒప్పుకుంటానని తెలిపింది. దీంతో ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. తను బాలీవుడ్ నుంచి వచ్చింది. టాలీవుడ్ లో మళ్లీ రావా అనే మూవీలో నటించింది. ఇందులో నటనకు, అందానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత దేవదాస్, క్లాప్, శివుడు చిత్రాలలో మంచి పాత్రలే దక్కాయి.
కాగా ఆకాంక్ష సింగ్ కు ఆశించినంత మేర వర్కవుట్ కాలేదని చెప్పక తప్పదు. సినిమాలలో కీ రోల్స్ పోషించినా ఎందుకనో తనను ఆదరించలేదు తెలుగు ప్రేక్షకులు. తనకు అందంతో పాటు మంచి టాలెంట్ ఉందని వాపోయింది ఈ అమ్మడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం అంటే మూడు సంవత్సరాల తదుపరి తనకు షష్టిపూర్తి చిత్రంలో నటించేందుకు అవకాశం దక్కింది. ఈ సినిమాపై పాజిటివ్ టాక్ వచ్చింది. దీనికి పవన్ ప్రభ దర్శకత్వం వహించాడు. సంగీతం ఇళయరాజా అందించాడు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా తప్పకుండా ఆడుతుందనే నమ్మకంతో ఉంది ఆకాంక్ష సింగ్.
