అఖిల్ అక్కినేని కుటుంబ క‌థా చిత్రం

హైద‌రాబాద్ లో ఘ‌నంగా ర‌విడ్జితో పెళ్లి

అఖిల్ అక్కినేని, జైనాబ్ ర‌వ్డీజీ పెళ్లి ఒక అంద‌మైన కుటుంబ క‌థా చిత్రం అంటూ పేర్కొంది న‌టి శోభితా ధూళిపాళ‌. త‌ను ఇటీవ‌లే నాగ్ చైత‌న్య‌ను పెళ్లి చేసుకుంది. అంత‌కు ముందు చైతూ ప్ర‌ముఖ న‌టి స‌మంత రుత్ ప్ర‌భుతో పెళ్లి చేసుకుని విడి పోయాడు. ఆ త‌ర్వాత శోభిత మెడ‌లో తాళి క‌ట్టాడు. తాజాగా త‌న సోద‌రుడు అఖిల్ అక్కినేని గ‌త కొంత కాలంగా జైనాబ్ తో డేటింగ్ లో ఉన్నాడు. ఇద్ద‌రూ క‌లిసి విదేశాల‌లో చెట్టా ప‌ట్టాల్ వేసుకుని తిరిగారు. కెమెరాల‌కు చిక్కారు. చివ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌కుండా రిసెప్ష‌న్ కానిచ్చేశారు. ఆ త‌ర్వాత ఎంగేజ్ మెంట్, ఉన్న‌ట్టుండి త్వ‌ర‌గా వివాహం కూడా చేసేసుకున్నారు.

కేవ‌లం కొద్దిమంది సినీ రంగానికి చెందిన హీరో హీరోయిన్లు, కుటుంబీకులు మాత్ర‌మే ఈ పెళ్లికి హాజ‌ర‌య్యారు. ఆదివారం భారీ ఎత్తున రిసెప్ష‌న్ ఏర్పాట్లు చేశారు. హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ స్టూడియోస్ లో జ‌ర‌గ‌నుంది. ఈ వివాహానికి చిరంజీవి, రామ్ చరణ్ , నాగ చైతన్యతో సహా తెలుగు సినీ తారలు హాజరయ్యారు.అఖిల్ తెల్ల కుర్తాచ‌ ధోతీ ధరించగా, జైనాబ్ బంగారు బ్లౌజ్‌తో తెల్లటి పట్టు చీర ధరించింది.

శోభిత ధూళిపాళ షేర్ చేసిన ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో నాగార్జున, అతని భార్య అమల, నాగ చైతన్య, శోభిత నూతన వధూవరులతో కలిసి దిగారు. వివాహానికి ముందు ఒక ఉత్సాహ భరితమైన బరాత్ వేడుక జరిగింది, అక్కడ చైతన్య సాంప్రదాయ ఎరుపు కుర్తాలో నృత్య ప్రదర్శనతో దృష్టిని ఆకర్షించాడు.

దర్శకుడు ప్రశాంత్ నీల్, చిరంజీవి, దగ్గుబాటి వెంకటేష్ , నాగార్జునతో సహా చాలా మంది అతిథులు తెలుపు, బంగారు రంగు దుస్తులు ధరించి కనిపించారు. రామ్ చరణ్ , ఉపాసన కూడా పూర్తిగా తెల్లటి దుస్తులలో వచ్చారు.అఖిల్, జైనాబ్ గత సంవత్సరం నవంబర్‌లో నిశ్చితార్థం చేసుకోవడానికి ముందు రెండేళ్లుగా సంబంధంలో ఉన్నారు. అక్కినేని అమలతో నాగార్జున రెండవ వివాహం ద్వారా పుట్టిన కుమారుడు అఖిల్, నాగ చైతన్యకు సవతి సోదరుడు.

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com