Hero Akhil Movie : లెనిన్ యాక్ష‌న్ సీన్స్ లో అఖిల్ బిజీ

సాంగ్ చిత్రీక‌ర‌ణ‌పై ద‌ర్శ‌కుడు ఫోక‌స్

Hero Akhil Movie

Akhil : చాలా గ్యాప్ త‌ర్వాత అఖిల్ అక్కినేని న‌టిస్తున్న చిత్రం లెనిన్. త‌ను ప్ర‌స్తుతం లెనిన్ మూవీలో న‌టిస్తుండ‌గా దీనిని ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ ప్రారంభ‌మైంది. ఈ మూవీకి సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సినిమాలో కీల‌క స‌న్నివేశాల‌ను అఖిల్ పై చిత్రీక‌రిస్తున్నారు. ఇంకో వైపు సూప‌ర్ సాంగ్ ఒక‌టి కూడా హైద‌రాబాద్ లోని అన్న‌పూర్ణ‌ ఫిలిం స్టూడియోలో చిత్రీక‌రిస్తార‌ని టాలీవుడ్ టాక్. ఇక అఖిల్(Akhil) గ‌తంలో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో పూజా హెగ్డేతో క‌లిసి బ్యాచిల‌ర్ మూవీలో న‌టించాడు.

Akhil Movie Updates

స్టూడియోలో ఈ సాంగ్ కోసం ప్ర‌త్యేకంగా సెట్స్ వేస్తున్నార‌ని, లెనిన్ ను ఎలాగైనా బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా తీయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు ద‌ర్శ‌కుడు. గ్యాప్ త‌ర్వాత అఖిల్ నుంచి వ‌చ్చే మూవీ కోసం త‌న ఫ్యాన్స్ ఎక్కువ‌గా ఎదురు చూస్తున్నారు. మ‌రో వైపు త‌న సోద‌రుడు నాగ చైత‌న్య బిజీగా ఉన్నాడు. త‌ను న‌టించిన తండేల్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇదే క్ర‌మంలో త‌న తండ్రి నాగార్జున కూడా సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టిస్తున్న కూలీలో కీ రోల్ పోషిస్తున్నాడు. మొత్తంగా అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.

పాట చిత్రీక‌ర‌ణ త‌ర్వాత కీల‌క‌మైన స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తార‌ని, లెనిన్ పూర్తిగా రాయల‌సీమ నేప‌థ్యంలో ఉంటుంద‌ని అంచ‌నా. చిత్తూరు ప్రాంతం ఇందులో క‌థాంశంగా ఉండ‌నుంది. ఇది పూర్తిగా అక్క‌డి యాస‌లోనే ఉటుంది. ద‌స‌రా పండుగ రోజు రిలీజ్ చేయ‌నున్న‌ట్లు టాక్. ఇందులో ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల కీ రోల్ పోషిస్తుండ‌డం విశేషం. త‌ను న‌టించిన రాబిన్ హుడ్ ఆశించిన మేర ఆడ‌లేదు. కార్తీక్ ఆర్య‌న్ తో క‌లిసి హిందీలో ఆషిఖి 3 లో న‌టిస్తోంది. మొత్తంగా సినిమాలు ఆడ‌క పోయినా త‌నకు ప‌లు సినిమాల‌లో ఛాన్స్ లు వ‌స్తుండ‌డం విశేషం. అఖిల్, శ్రీ‌లీల కాంబో ఎలా ఉండ‌బోతోంద‌నేది సినిమా రిలీజ్ అయ్యాక తేలుతుంది.

Also Read : Shruti Haasan Shocking :మోస పోయినా ప్రేమిస్తూనే ఉంటా

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com