సినీ సెలబ్రిటీలు ఏది చేసినా అది ఓ సంచలనమే. తాజాగా అక్కినేని నాగార్జున ముద్దుల తనయుడు అఖిల్ అక్కినేని గురించి కీలక అప్ డేట్ వచ్చింది. తను ఏరికోరి ముంబైకి చెందిన జైనాబ్ రవ్జీని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యాడు. ఇద్దరి కులాలు వేరు. తను టాప్ మోడల్ గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకుంది. భారీ ఎత్తున సంపద కూడా కలిగి ఉంది. ఇదే సమయంలో అక్కినేని ఫ్యామిలీకి ఏం తక్కువ లేదు. రమారమి దాదాపు రూ. 1000 కోట్లకు పైగానే ఆస్తులు ఉంటాయని అంచనా.
తాజాగా అందిన సమాచరం మేరకు పెళ్లి తేదీని అక్కినేని, అమల ఫిక్స్ చేసినట్లు సమాచారం. జూన్ మొదటి వారంలో తన స్నేహితురాలు జైనాబ్ రవ్జీని పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఇద్దరూ చూడ ముచ్చటగా ఉంటారు. భారీ ఎత్తున ఖర్చు కూడా చేస్తున్నారు. ఇప్పటికే పెళ్లి పనులలో బిజీగా ఉన్నారు అక్కినేని ఫ్యామిలీ. మరో వైపు ఈ ఏడాది సోదరుడు నాగ చైతన్యకు మంచి ఫలితాన్ని ఇచ్చేలా చేసింది. తను సాయి పల్లవితో కలిసి నటించిన తండేల్ మూవీ బిగ్ సక్సెస్ అయ్యింది.
తను మొదట ప్రముఖ నటి సమంత రుత్ ప్రభును పెళ్లి చేసుకున్నాడు. ఈ ఇద్దరితో గౌతమ్ వాసుదేవ మీనన్ అద్భుతమైన ప్రేమ కావ్యంగా ఏం మాయ చేశావే అనే సినిమా తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ప్రధానంగా యూత్ ను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడటం, పెళ్లి చేసుకోవడం, చివరకు విడాకులు తీసుకోవడం కూడా జరిగి పోయింది. ఈ సమయంలో కొంత గ్యాప్ ఇస్తూ వచ్చింది నాగార్జున ఫ్యామిలీ. నాగ చైతన్యకు శోభిత ధూళిపాళకు పెళ్లి చేశాడు. ఇప్పుడు అఖిల్ , జైనాబ్ తో వివాహం జరిపించ బోతున్నాడు.
