హైదరాబాద్ – ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ అక్కినేని ఓ ఇంటి వాడయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం 3 గంటలకు సాంప్రదాయ బద్దంగా ఒక్కటయ్యారు. దగ్గరుండి నాగార్జున, అమల ఈ పెళ్లి జరిపించారు. కేవలం కొందరిని మాత్రమే ఆహ్వానించారు నాగ్. ఇటీవలే ఆయన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను స్వయంగా కలిసి తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు.
సన్నిహిత వేడుకలో అఖిల్ అక్కినేని జైనాబ్ రవ్జీని వివాహం చేసుకున్నాడు. ఈ ప్రైవేట్ కార్యక్రమంలో అనేక మంది సినీ పరిశ్రమ ప్రముఖులు, వధూవరుల కుటుంబాల సన్నిహితులు పాల్గొన్నారు. జూబ్లీ హిల్స్‌లోని నాగార్జున అక్కినేని నివాసంలో వివాహం జరిగింది.
ఈ వేడుకకు హాజరైన వారిలో మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, రామ్ చరణ్, భార్య ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్, తో పాటు చాలా మంది హీరోలు, హీరోయిన్లు అటెండ్ అయ్యారు.
జూన్ 8న ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ అగ్రశ్రేణి తారలు, ప్రముఖ రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరవుతారని భావిస్తున్నారు. ఈ రిసెప్షన్‌ను అక్కినేని కుటుంబం విలాసవంతమైన స్థాయిలో ప్లాన్ చేస్తోందని సమాచారం.
