ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే విషెస్ చెప్పారు దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావుకు. ఆయనకు 89 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్బంగా బన్నీ ప్రత్యేక సందేశం పోస్ట్ చేశారు. ఆయన చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. గ్యాటిట్యూడ్ ఫర్ ఎవర్ అంటూ పేర్కొన్నారు. హృదయ పూర్వకమైన శుభాకాంక్షలు మీకు. మీరు చల్లగా, హాయిగా, సుఖ సంతోషాలతో, నిండు నూరేళ్లు జీవించాలని , ఇలాగే తమను అలరించాలని కోరారు. ఎందుకంటే సినిమా రంగంలో తనకు కెరీర్ పరంగా తొలి చిత్రం తనకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపాడు.
ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో కె. రాఘవేంద్ర రావు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక సినిమా కెరీర్ పరంగా అల్లు అర్జున్ టాలీవుడ్ లో తొలి మూవీ గంగోత్రి. ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు దర్శకేంద్రుడు. 2003లో ఈ సినిమా వచ్చింది. తన కెరీర్ అద్భుతంగా ప్రారంభమైంది. దాదాపు తను సినీ రంగంలోకి వచ్చి 22 ఏళ్లవుతోంది అల్లు అర్జున్ కు.
ఈ సందర్బంగా బన్నీ హృదయ పూర్వకమైన థ్యాంక్స్ తెలియ చేశాడు. అంతే కాదు తనను ప్రశంసలతో ముంచెత్తాడు పాన్ ఇండియన్ హీరో. నా గురువు రాఘవేంద్ర రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా మొదటి దర్శకుడు. నన్ను సినిమాల్లోకి వచ్చేలా చేసిన అరుదైన వ్యక్తి. ఆయన ఆశీర్వాద బలం తనకు ఎంతో మేలు చేకూర్చేలా చేసిందన్నారు బన్నీ. తనను పాన్ ఇండియా లెవల్లో హీరో గా నిలబెట్టేలా చేసేందుకు దోహద పడేలా చేసిందని పేర్కొన్నాడు.