Allu Arjun : బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు ఆహ్వానం అందుకున్న బన్నీ మరి వచ్చేనా..?

అయితే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మెగా-అల్లు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య పెద్ద దుమారమే చెలరేగుతుంది...

Hello Telugu - Allu Arjun

Allu Arjun : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయాలు రెండే రెండు. ఒకటి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలైతే.. రెండోది మెగా-అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ మధ్య వార్. ఈ రెండు టాపిక్స్.. టాలీవుడ్‌లోనూ, అలాగే సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్‌ని ప్లాన్ చేశారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో ఓ భారీ వేడుకను నిర్వహించేందుకు టాలీవుడ్ సన్నద్ధమవుతోంది. ఈ క్రమంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులనే కాకుండా.. ఇతర సినీ ఇండస్ట్రీల వారికి కూడా ఆహ్వానాలను పంపుతున్నారు. తాజాగా ఈ ఆహ్వానం అల్లు అర్జున్‌(Allu Arjun)కు కూడా చేరింది.

Allu Arjun….

నేషనల్ అవార్డు గ్రహీత ఐకాన్ స్టార్ట్ అల్లు అర్జున్‌(Allu Arjun) ను కలిసి, ఈ వేడుకకు రావాల్సిందిగా తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, నిర్మాతల మండలి సెక్రటరీ ప్రసన్న కుమార్, తెలంగాణ స్టేట్ చాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ అనుపమ రెడ్డి.. మా అసోసియేషన్ నుండి మాదాల రవి, శివ బాలాజీ, నిర్మాత ముత్యాల రామదాసు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆహ్వానించడానికి వచ్చిన సినీ పెద్దలతో అల్లు అర్జున్ సానుకూలంగా స్పందిస్తూ.. బాలకృష్ణతో తనకి ఉన్న అనుబంధాన్ని పంచుకున్నట్లుగా సమాచారం.

అయితే.. సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా మెగా-అల్లు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఏపీలో ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ తన భార్య ఫ్రెండ్ భర్త అయిన వైసీపీ నేతకు సపోర్ట్‌గా వెళ్లడంతో.. మెగా-అల్లు ఫ్యామిలీల మధ్య దూరం పెరగడం, ఫ్యాన్స్ హర్టవడం.. తద్వారా మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఆర్మీ అన్నట్లుగా సోషల్ మీడియా మారిపోయింది. ఇక రీసెంట్‌గా జరిగిన ఓ సినిమా ఫంక్షన్‌లో అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ కూడా ఈ వివాదాన్ని మరింతగా ముందుకు తీసుకెళుతున్నాయి. ఇప్పుడంతా అల్లు అర్జున్‌కి రివర్స్ అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి బాలయ్య వేడుకకు సంబంధించి ఆహ్వానం అందింది. ఆయన వస్తానని కూడా మాటిచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి వస్తున్న ఈ వేడుకకు అల్లు అర్జున్ వెళతాడా? అనేది అనుమానంగా మారింది. ఒకవేళ వెళ్లి.. ఆప్యాయంగా చిరు, అల్లు అర్జున్ మాట్లాడుకునే సందర్భం కనుక వస్తే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న యుద్ధవాతావరణానికి ఫుల్ స్టాప్ పడినట్లే. అదే జరగాలని అంతా కోరుకుంటున్నారు. చూద్దాం.. ఏం జరగనుందో.

Also Read : Sid Sriram: ‘వీక్ష‌ణం’ సినిమా నుండి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్ !

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com