ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశాడు. తాజాగా తెలంగాణ సర్కార్ ఫిలిం అవార్డులను ప్రకటించింది. మొత్తం 30 సినిమాలను ఎంపిక చేసింది. ఈ పురస్కారాలను 2014 నుంచి 2023 వరకు ప్రకటించింది. ఈ పురస్కారాలతో పాటు ఆరు స్పెషల్ కేటగిరీ కింద అవార్డులను ఖరారు చేసింది. ఇందులో ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నిర్మాత, తదితర కేటగిరీలలో ఆయా సినిమాలను పరిగణలోకి తీసుకుంది జ్యూరీ.
ఈ జాబితాలో అత్యుత్తమ నటుడి కేటగిరీ కింద పుష్ప -2 అద్భుతంగా నటించినందుకు గాను ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఎంపిక చేసింది. తనతో పాటు ఎన్టీఆర్ ఫిలిం అవార్డును నందమూరి బాలకృష్ణ, పుష్ప -1, పుష్ప 2 మూవీస్ కు దర్శకత్వం వహించిన సుకుమార్ కు బీఎన్ రెడ్డి స్మారక పురస్కారం కింద ఎంపిక చేసింది.
ఈ సందర్బంగా తనను ఉత్తమ నటుడిగా ఖరారు చేసినందుకు స్పందించాడు బన్నీ. తెలంగాణ ప్రభుత్వానికి, అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ కమిటీకి, సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా పుష్ప -2 రిలీజ్ సందర్బంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ పై కేసు నమోదు చేశారు. ఆపై తనను అరెస్ట్ చేశారు. దీంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది రాష్ట్ర ప్రభుత్వం. చివరకు తనను బెస్ట్ యాక్టర్ గా ఎంపిక చేయడంతో తనపై ఉన్న విమర్శలకు చెక్ పెట్టింది జ్యూరీ .
