Allu Sirish : పుష్ప 2 రిలీజ్ పై ఆసక్తికర అంశాలను వెల్లడించిన శిరీష్

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘పుష్ప ది రైజ్‌’...

Hello Telugu - Allu Sirish

Allu Sirish : అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అల్లు శిరీష్‌(Allu Sirish). ‘పుష్ప 2’ విడుదల ఆలస్యం అవుతోంది అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారంపై ‘బడ్డీ’ ప్రమోషన్స్‌ వేదికగా స్పందించారు. ‘‘ పుష్ప 2’పై మీ ఉత్సాహాన్ని ఇలాగే కొనసాగించండి. డిసెంబర్‌ 6వ తేదీ లేదా ఎప్పుడు వచ్చినా ఆ సినిమా తప్పకుండా మీ అంచనాలు అందుకుంటుంది. ఇది మా అన్నయ్య సినిమా అని నేను చెప్పడం లేదు. సుకుమార్‌ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారని ఫిల్మ్‌నగర్‌లో మాట్లాడుకుంటుంటే అది నావరకూ వచ్చింది. దానినే మీతో పంచుకుంటున్నా’’ అని చెప్పారు.

Allu Sirish Comment

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ డ్రామా ‘పుష్ప ది రైజ్‌’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. దీనికి కొనసాగింపుగా ‘పుష్ప ది రూల్‌’ సిద్థమవుతోంది. తొలుత దీనిని ఆగస్టు 15న విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించినప్పటికీ పలు కారణాల వల్ల డిసెంబర్‌ ఆరో తేదీకి వాయిదా వేశారు. ‘ ఊర్వశివో రాక్షసివో’ తర్వాత అల్లు శిరీష్‌ నటించిన చిత్రమిది. స్టూడియో గ్రీన్‌ పతాకంపై తెరకెక్కింది. గాయత్రి భరద్వాజ్‌, గోకుల్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సామ్‌ ఆంటోన్‌ దర్శకత్వం వహించగా.. కె. ఇ. జ్ఞానవేల్‌ రాజా నిర్మించారు. ఆగస్టు 2న విడుదల కానుంది.

Also Read : Akash Puri : తన పేరు మార్చుకుని ఇకపై ఆ పిలవాలని కోరిన ఆకాష్ పూరి

Leave A Reply

Your email address will not be published.

Social Media Auto Publish Powered By : XYZScripts.com