3 Roses Web Series Sensational :వెబ్ సీరీస్ 3 రోజెస్ గ్లింప్స్ రిలీజ్

బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ గా కుషిత క‌ల్లాపు

3 Roses : వెబ్ సీరీస్ 3 రోజెస్ కు సంబంధించి కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. సీజ‌న్ 1 స‌క్సెస్ త‌ర్వాత సీజ‌న్ 2 రిలీజ్ కు సిద్దంగా ఉంది. తాజాగా గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో కుషిత క‌ల్లాపు(Kushita Kallapu) త‌న అందాల‌ను వెద‌జ‌ల్లింది. త్వ‌ర‌లోనే సీజ‌న్ 2 రాబోతోందంటూ ప్ర‌క‌టించారు. దీనిని మారుతి ప‌ర్య‌వేక్షించాడు. త్రీ రోజెస్ లో ఈషా రెబ్బా, ప్రిన్స్ సెసిల్, హేమ‌, స‌త్యం రాజేష్, హ‌ర్ష చెముడు , కుషిత కీ రోల్స్ పోషించారు.

3 Roses Web Series Updates

కుషిత క‌ల్లాపు కీ రోల్స్ పోషించింది సీజ‌న్ 2లో. దీనిని మాస్ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై ప్ర‌ముఖ చిత్ర నిర్మాత ఎస్కేఎన్ నిర్మించారు. ద‌ర్శ‌కుడు మారుతి షో ర‌న్న‌ర్ గా వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. దీనికి క‌థ‌ను ర‌వి నంబూరి, సందీప్ బొల్లా అందించారు. కిర‌ణ్ కె. క‌ర‌వ‌ల్ల కొత్త సీజ‌న్ 2కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇవాళ సీజ‌న్ 2 నుండి న‌టి కుషిత క‌ల్లాపు న‌టించిన ప్ర‌త్యేక టీజ‌ర్ ను విడుద‌ల చేశారు మూవీ మేక‌ర్స్.

త‌న పాత్ర పూర్తిగా బోల్డ్ గా, స్ట్రాంగ్ గా, మ‌రింత లుక్ లో క‌నిపిస్తుండ‌డం సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. తెలుగు వారికి ఎక్కువ‌గా ఛాన్స్ లు ఇవ్వాల‌నే ఉద్దేశంతోనే నిర్మాత చాలా మందికి అవకాశం ఇచ్చారు. కుషిత క‌ల్లాపు సోష‌ల్ మీడియాలో ఇన్ ఫ్యూయ‌ర్స్ గా పేరు పొందింది. త‌ను నిత్యం బిజీగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్తిగ‌త ఫోటోల‌ను పోస్ట్ చేస్తూ వ‌స్తోంది. ఈషా రెబ్బా న‌టించిన టీజ‌ర్ కు కూడా మంచి స్పంద‌న ల‌భించింది.

Also Read : Hero Balakrishna-Jailer 2:త‌లైవా జైల‌ర్ 2 లో నంద‌మూరి బాల‌య్య

GlimpseKushita KallapuUpdatesViralWeb Series
Comments (0)
Add Comment