Hero Ram Charan -Game Changer :ఓటీటీలోనూ ఆద‌ర‌ణ‌కు నోచుకోని గేమ్ ఛేంజ‌ర్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్ లో బిగ్ డిజాస్ట‌ర్

Game Changer  : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం గేమ్ ఛేంజ‌ర్(Game Changer). ఇందులో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ న‌టించ‌గా శంక‌ర్ దీనిని తీశాడు. భారీ ఎత్తున ఖ‌ర్చు చేశారు. ఎన్ని ప్ర‌మోష‌న్స్ చేసినా టేకింగ్, మేకింగ్ లో పూర్తిగా విఫ‌లం అయ్యాడు డైరెక్ట‌ర్. ఊహించ‌ని రీతిలో బొక్క బోర్లా ప‌డింది. ఈ ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. తీవ్ర నిరాశ‌కు గురి చేసింది. పెద్ద న‌ష్టాన్ని మిగిల్చింది సినీ నిర్మాత‌కు. ఇదే సమయంలో త‌ను తీసిన మ‌రో చిత్రం సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 300 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాడు దిల్ రాజు.

Game Changer Movie

అయితే మెగాస్టార్ ఫ్యామిలీ మొత్తం కేవ‌లం త‌మ పేరు మీద సినిమాలు ఆడుతాయ‌నే న‌మ్మ‌కంతో ఉండ‌డం పెద్ద షాక్ ఇచ్చేలా చేసింది. గ‌తంలో చిరంజీవితో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ , పూజా హెగ్డే న‌టించిన కొర‌టాల శివ తీసిన ఆచార్య బొక్క బోర్లా ప‌డింది. ఆ సినిమాను తండ్రీకొడుకులే తీశార‌ని, డైరెక్ట‌ర్ ప్ర‌మేయం లేకుండా చేశారంటూ అప్ప‌ట్లో పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ అవార్డు స్వంతం చేసుకుంది. ఇదే స‌మ‌యంలో శంక‌ర్ ను న‌మ్మి గేమ్ ఛేంజ‌ర్ లో న‌టించాడు.

కేవ‌లం త‌న పేరు మీద మార్కెట్ జ‌రుగుతుంద‌ని, సినిమా బిగ్ స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మాడు చెర్రీ. కానీ ప్రేక్ష‌కులు పెద్ద ఎత్తున షాక్ ఇచ్చారు. ఈ త‌రుణంలో ఓటీటీ రైట్స్ ను జీ5 స్వంతం చేసుకుంది. దీనిని ఓటీటీలో స్ట్రీమింగ్ కాగా అక్క‌డ కూడా ఆశించినంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. బిగ్ స్టార్లు న‌టించిన చిత్రాలు ఏవీ వ‌ర్క‌వుట్ కావ‌డం లేదు.

Also Read : Megastar – Beauty Deepika :మెగా మూవీలో దీపికా ప‌దుకొనే..?

game changerGlobal Star Ram CharanUpdatesViral
Comments (0)
Add Comment