Aakasamlo Oka Tara : మరో తెలుగు సినిమా ‘ఆకాశంలో ఒక తార’ తో దుల్కర్

Aakasamlo Oka Tara : మలయాళ సూపర్‌స్టార్ దుల్క‌ర్ స‌ల్మాన్. తెలుగు ప్రేక్ష‌కుల‌కే కాదు, ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీ ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. వైవిధ్య‌మైన పాత్ర‌లు, సినిమాల‌తో త‌న‌దైన ముద్రవేశాడు. తెలుగులోనూ మ‌హాన‌టి, సీతారామం వంటి సూప‌ర్ హిట్ చిత్రాల్లో అద్భుత‌మైన న‌ట‌న‌తో ఈయ‌న అల‌రించిన సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ క‌ల్కి 2898 ఏడీలోనూ అతిథి పాత్ర‌లోనూ దుల్క‌ర్ అల‌రించారు.

Aakasamlo Oka Tara Movie Updates

ఇప్ప‌టికే ఆయ‌న హీరోగా తెలుగులో ల‌క్కీ భాస్క‌ర్ చిత్రం రూపొందుతుండ‌గా తాజాగా మ‌రో తెలుగు సినిమా ప్రారంభమైంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, స్వ‌ప్న సినిమా, లైట్ బాక్స్ మీడియా సంయుక్త నిర్మాణంలో ప‌వ‌న్ సాధినేని ద‌ర్శ‌క‌త్వంలో ‘ఆకాశంలో ఒక తార’ అనే చిత్రం తెర‌కెక్క‌నుంది. అయితే ఈ రోజు దుల్క‌ర్ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీ పోస్ట‌ర్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ లుక్ చాలా సింపుల్‌గా ఉంది. ఓ రైతులా క‌నిపిస్తుండ‌గా.. అదే పోస్ట‌ర్‌లో ఓ అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని వెళుతుండ‌టాన్ని చూడొచ్చు. ఈ పోస్ట‌ర్‌ను చూస్తుంటే దుల్క‌ర్ మ‌రో డిఫ‌రెంట్ రోల్‌తో అల‌రించ‌బోతున్నార‌నే విష‌యం స్ప‌ష్ట‌మవుతోంది. ఆడియెన్స్‌లో ఓ క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది.

Also Read : Minmini Movie : దృశ్యం నటి ‘ఎస్తర్ అనిల్’ మెయిన్ లీడ్ గా వస్తున్న ‘మిన్మిని’ సినిమా

Dulquer SalmanMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment