Aamir Khan : ఆ ప్రముఖ గాయకుడి బయోపిక్ కు అమీర్ ఖాన్ హీరోనా..

ఇప్పుడీ చిత్రంలో ఆమిర్‌ నటిస్తున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది...

Aamir Khan : బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ గత చిత్రం ‘లాల్‌సింగ్‌ చద్దా’ భారీ అంచనాల మధ్య విడుదలైంది. అయితే అంచనాలను తారుమారు చేసి పరాజయం పాలైంది. ఆ చిత్రం 2022లో విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆమిర్‌ కథల ఎంపికలో ఆచితూచి అడుగేస్తున్నారు. ప్రస్తుతం ‘సితారే జమీన్‌ పర్‌’ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆయన ఓ చిత్రానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. దివంగత గాయకుడు, నటుడు కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌ రానున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

Aamir Khan Movie Updates

ఇప్పుడీ చిత్రంలో ఆమిర్‌ నటిస్తున్నట్లు బాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. ‘‘ కిశోర్‌ కుమార్‌ బయోపిక్‌గా రాబోతున్న ఈ చిత్రానికి అనురాగ్‌ బసు దర్శకుడు. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌ నిర్మాత. వీరిద్దరికి ఈ చిత్రం చాలా ప్రత్యేకం. కొన్ని రోజులుగా వీరిద్దరితో ఈ చిత్రం గురించి ఆమిర్‌ ఖాన్‌ చర్చలు జరుపుతున్నారు. ఆమిర్‌ సైతం ఇందులో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిసింది. త్వరలో పూర్తి వివరాల్ని అధికారికంగా ప్రకటించనున్నారని ఆమిర్‌ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Also Read : Satyam Sundaram OTT : ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న కార్తీ ‘సత్యం సుందరం’ సినిమా

Aamir KhanMoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment