Aadhi Pinishetty Interesting Comment : బంధం నిజం విడిపోవ‌డం అబ‌ద్దం

ఖండించిన న‌టుడు ఆది పినిశెట్టి

Aadhi Pinishetty : త‌మళ సినీ న‌టుడు ఆది పినిశెట్టి(Aadhi Pinishetty) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తన భార్య నిక్కీ గ‌ల్రానీ తో విడి పోతున్న‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై స్పందించాడు. ఇదంతా కావాల‌ని ఎవ‌రో చేశారంటూ వాపోయాడు. తామిద్ద‌రం బాగానే ఉన్నామ‌ని చెప్పాడు. క‌లిసి ఉంటే కూడా ఓర్వ‌లేక పోతున్నారంటూ పేర్కొన్నాడు. ఇది పూర్తిగా అబ‌ద్ద‌మ‌న్నాడు ఆది పినిశెట్టి.

Aadhi Pinishetty Clarifies

త‌న భార్య‌తో విడాకులు తీసుకోబోతున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమ‌న్నాయి. ఆది పినిశెట్టి అటు త‌మిళంలో ఇటు తెలుగులో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌ను గ‌తంలో ఒక విచిత్రం, గుండెల్లో గోదారి సినిమాల‌లో కీల‌క పాత్ర‌లు పోషించాడు. ఆ సినిమాలు త‌న‌కు ప్రాణం పోశాయి.

త‌నను విల‌న్ గా ప్ర‌మోట్ చేశాడు ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను. స‌రైనోడులో బ‌న్నీకి ప్ర‌తి నాయ‌కుడిగా న‌టించాడు..మెప్పించాడు. ఆ త‌ర్వాత నిన్ను కోరి, సుకుమార్ తీసిన రంగ‌స్థ‌లంలో కూడా న‌టించాడు ఆది పినిశెట్టి. ప్ర‌స్తుతం శ‌బ్దం చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ చిత్రానికి వైశాలీ ఫేమ్ అరివ‌ళ‌గ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుంగా ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందించాడు. ఈ సినిమాకు సంబంధించి ప్ర‌స్తుతం ఆది పినిశెట్టి ప్ర‌మోష‌న్స్ లో బిజీగా ఉన్నాడు.

ఇదే స‌మ‌యంలో త‌న భార్య నుంచి తాను విడాకులు పొందుతున్న‌ట్లు ప్ర‌చారం జ‌ర‌గ‌డం ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ఆధారాలు లేకుండా ఎలా ప్ర‌చారం చేస్తారంటూ ప్ర‌శ్నించాడు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నాడు.

Also Read : Hero Thalapathy Vijay Meet :ద‌ళ‌ప‌తితో ప్ర‌శాంత్ కిషోర్ భేటీ

Aadhi PinisettyCommentsNikki GalraniUpdatesViral
Comments (0)
Add Comment