Hero Allu Arjun : విమ‌ర్శించ‌డం వ‌ల్ల‌నే సిక్స్ ప్యాక్ చేశా

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun : పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్(Allu Arjun) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ముంబైలో జ‌రిగిన వేవ్ స‌మ్మిట్ లో పాల్గొన్న త‌ను మ‌న‌సులోని మాట‌ల‌ను మొద‌టిసారిగా బ‌య‌ట పెట్టాడు. ఈ స్టార్ ఇమేజ్ వ‌చ్చేందుకు చాలా క‌ష్ట ప‌డ్డాన‌ని చెప్పాడు. తాను మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాన‌ని పేర్కొన్నాడు. ఆయ‌న ప్ర‌భావం త‌న‌పై ఎంతగానో ఉంద‌న్నాడు. అయితే తాను సిక్స్ ప్యాక్ ఎందుకు చేయాల్సి వ‌చ్చింద‌నే దానిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు.

Allu Arjun Shocking Comments

ఇదిలా ఉండ‌గా కొంద‌రు త‌న గురించి చాలా విమ‌ర్శ‌లు చేశార‌ని, ప్ర‌త్యేకించి తాను హీరోగా ప‌నికి రానంటూ కూడా కామెంట్స్ చేశార‌ని అన్నాడు. అయితే ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన గంగోత్రిలో న‌టించాన‌ని తెలిపాడు. ఈ మూవీలో తాను న‌ట‌న‌లోని మెల‌కువ‌ల‌ను నేర్చుకునేందుకు ఆస్కారం ఏర్ప‌డింద‌ని చెప్పాడు బ‌న్నీ. ఇదే స‌మ‌యంలో ఓ హీరోయిన్ త‌నను ఉద్దేశించి అన్న మాట‌ల‌కు డిస్ప‌ప్పాయింట్ అయ్యాన‌ని, ఇక తానెందుకు సిక్స్ ప్యాక్ చేయ‌లేన‌ని మ‌న‌సులో అనుకుని వెంట‌నే ప్రాక్టీస్ చేయ‌డం ప్రారంభించాన‌ని అన్నాడు.

తాను విమ‌ర్శ‌లు ప‌ట్టించుకోన‌ని, కేవ‌లం ఫోక‌స్ న‌ట‌న‌పై పెడ‌తాన‌ని స్ప‌ష్టం చేశాడు బ‌న్నీ. ఇదే స‌మ‌యంలో త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్, సుకుమార్ లాంటి ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేయ‌డం కూడా క‌లిసి వ‌చ్చేలా చేసింద‌న్నాడు. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో పుష్ప‌, పుష్ప‌2 సినిమాల‌ను అద్భుతంగా ఆద‌రించార‌ని, ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపాడు. త్వ‌ర‌లో అట్లీతో క‌లిసి ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ రాబోతోంద‌న్నాడు.

Also Read : Hero Ajith Kumar :అజిత్ వ్య‌వ‌హారం వాసుదేవ మీన‌న్ ఆగ్ర‌హం

allu arjunCommentsShockingUpdatesViral
Comments (0)
Add Comment