Brahmaji : నాగార్జున ఎవ‌ర్ గ్రీన్ హీరో

ప్ర‌శంసించిన న‌టుడు బ్ర‌హ్మాజీ

Brahmaji : అక్కినేని నాగార్జున ఎవ‌ర్ గ్రీన్ హీరో అంటూ ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు న‌టుడు బ్ర‌హ్మాజీ. టాలీవుడ్ కు చెందిన అరుదైన న‌టుడ‌ని పేర్కొన్నారు. చాలా మంది న‌టులు ముస‌లి వారై పోతున్నార‌ని, కానీ రోజు రోజుకు త‌న గ్లామ‌ర్ తో మ‌రింత అందంగా త‌యార‌వుతున్నారంటూ నాగ్ కు కితాబు ఇచ్చారు బ్ర‌హ్మాజీ(Brahmaji).

Brahmaji Appreciated Nagarjuna

అక్కినేని నాగార్జున‌కు 63 ఏళ్లు అంటే న‌మ్మ‌లేక పోతున్నాన‌ని పేర్కొన్నారు. ఆగ‌స్టు 29 ఆయ‌న పుట్టిన రోజు. 1959లో అక్కినేని నాగేశ్వ‌ర్ రావు దంప‌తుల‌కు జ‌న్మించారు. న‌టుడు, నిర్మాత‌, వ్యాపార‌వేత్త‌గా రాణిస్తున్నారు. ప్ర‌యోక్త‌గా స‌క్సెస్ అయ్యారు.

నాగార్జున ప్ర‌ముఖ న‌టి అమ‌ల‌ను పెళ్లి చేసుకున్నారు. నాగ చైత‌న్య‌, అఖిల్ అక్కినేని నాగార్జునకు పిల్ల‌లు. న‌టుడిగా తెలుగు, హిందీ, త‌మిళ భాషా చిత్రాల‌లో న‌టించారు. ఆయ‌న నిర్మించి , న‌టించిన నిన్నే పెళ్లాడుతా ఏకంగా 9 రాష్ట్ర నంది అవార్డులు పొందింది.

మూడు ఫిలిం ఫేర్ పుర‌స్కారాలు, సౌత్ , రెండు జాతీయ చ‌ల‌న చిత్ర అవార్డులు అందుకున్నాడు అక్కినేని నాగార్జున‌. నాగార్జున రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. కె. రాఘ‌వేంద్ర రావు ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన అన్న‌మ‌య్య చిత్రం దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ ల‌భించింది.

Also Read : Pawan Kalyan : ప‌వ‌న్ పుట్టిన రోజున వేడుక‌లు

Comments (0)
Add Comment