Krishna Bhagavan- Hero Pawan :ద‌మ్మున్నోడు అనుకున్న‌ది సాధించాడు

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై కృష్ణ భ‌గ‌వాన్

Krishna Bhagavan : విల‌క్ష‌ణ న‌టుడు, క‌మెడియ‌న్ , ర‌చ‌యిత కృష్ణ భ‌గ‌వాన్(Krishna Bhagavan) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో కొంద‌రిని చూస్తే చాలా ముచ్చ‌ట వేస్తోంద‌న్నారు. చిట్ చాట్ సంద‌ర్బంగా ఆయ‌న త‌న మ‌న‌సులోని అభిప్రాయాల‌ను పంచుకున్నారు. సినీ రంగంలో టాప్ హీరోగా ఉంటూనే రాజ‌కీయాల‌లో రాణించ‌డం చాలా క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు. కొంద‌రు మాత్ర‌మే స‌క్సెస్ అయ్యార‌ని, మిగ‌తా వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని తెలిపారు. త‌మిళ‌నాడులో ఎంజీ రామ‌చంద్ర‌న్, జ‌య‌లలిత ఉమ్మ‌డి ఏపీ రాష్ట్రంలో నంద‌మూరి తార‌క రామారావు లాంటి వారు స‌క్సెస్ అయ్యార‌ని ఇది మామూలు విష‌యం కాద‌న్నారు.

Krishna Bhagavan Praises Hero Pawan Kalyan

అయితే ఇదే స‌మ‌యంలో ఎన్నో స‌వాళ్ల‌ను, క‌ష్టాల‌ను, ఇబ్బందుల‌ను ఎదుర్కొన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు కృష్ణ భ‌గవాన్. త‌న‌కు సినిమాల ప‌రంగా స్టార్ ఇమేజ్ ఉంద‌ని, కోట్ల‌ల్లో రెమ్యూన‌రేష‌న్ వ‌స్తున్నా ప్ర‌జ‌ల కోసం త‌ను అన్నింటిని వ‌దిలివేసి రాజ‌కీయాల్లోకి రావ‌డం ఇత‌రుల‌ను, త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నారు. కానీ అనుకున్న దానిని ఆయ‌న సాధించార‌ని, ఈ క్రెడిట్ అంతా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కే ద‌క్కుతుంద‌న్నారు కృష్ణ భ‌గ‌వాన్.

ప‌వ‌ర్ స్టార్ రాజ‌కీయ ప‌రివ‌ర్త‌న చాలా మందికి ఇన్సిపిరేష‌న్ గా నిలుస్తుంద‌న్నారు. త‌న అంకిత‌భావం, ప‌ట్టుద‌ల‌కు ఫిదా కావాల్సిందేన‌ని చెప్పారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అనే సౌక‌ర్య‌వంత‌మైన ప్ర‌పంచాన్ని పూర్తిగా విడిచి పెట్టాడు. క‌ఠిన‌మైన దారిని ఎంచుకున్నాడు. కానీ ఎవ‌రైనా సంతోషాన్ని, క‌ష్టాలు లేని లోకాన్ని కోరుకుంటారు. కానీ ప‌వ‌ర్ స్టార్ అలా కాదు అన్నింటినీ త్య‌జించి..ఈ స్థాయికి రావ‌డం, ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి ఎద‌గ‌డం అద్భుత‌మ‌ని ప్ర‌శంసించారు కృష్ణ భ‌గ‌వాన్. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Popular Actress Rambha :తిరిగి వ‌చ్చా సినిమాల్లో న‌టిస్తా

CommentsKrishna Bhagavaanpawan kalyanViral
Comments (0)
Add Comment