Hero Mahesh Babu-ED : ఈడీ విచార‌ణ‌కు మ‌హేష్ బాబు డుమ్మా

మ‌రో తేదీ ఇవ్వాల‌ని కోరిన యాక్ట‌ర్

Mahesh Babu : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఈడీకి ఝ‌ల‌క్ ఇచ్చారు న‌టుడు మ‌హేష్ బాబు. సాయి డెవ‌ల‌ప‌ర్స్ , సురానా గ్రూప్ సంస్థ‌ల నుంచి డ‌బ్బులు చెక్కులు, న‌గ‌దు రూపేణా తీసుకున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఈడీ ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు ఇందులో మ‌నీ లాండ‌రింగ్ జ‌రిగింద‌ని భావించింది. ఇందులో భాగంగా న‌టుడికి నోటీసులు జారీ చేసింది. అనంత‌రం ఈనెల 27న ఆదివారం త‌మ ఆఫీసు ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ స‌మ‌న్లు ఇచ్చింది. దీనిపై నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర దించారు మ‌హేష్ బాబు(Mahesh Babu). త‌న‌కు షూటింగ్ ఉంద‌ని, అందులో బిజీగా ఉన్నాన‌ని, మీరు నిర్దేశించిన రోజున తాను హాజ‌రు కాలేనంటూ డుమ్మా కొట్టాడు.

Mahesh Babu – ED Case Updates

ఈడీకి లేఖ రాశాడు. విచార‌ణ‌కు సంబంధించి త‌న‌కు వేరే తేదీ కేటాయించాల‌ని కోరాడు ఈడీని. ఇప్ప‌టికే ప్లాట్స్ పేరుతో, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేసి పెద్ద ఎత్తున మోసానికి పాల్ప‌డిన‌ట్లు విమ‌ర్శ‌లున్నాయి సాయి డెవ‌ల‌ప‌ర్స్, సురానా గ్రూప్ సంస్థ‌ల‌పై. ఈ సంస్థ‌ల‌కు మ‌హేష్ బాబు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉన్నాడు. త‌ను ప్ర‌చారం చేసినందుకు రూ.5 కోట్ల‌కు పైగా తీసుకున్న‌ట్లు ఈడీ సోదాలలో బ‌య‌ట ప‌డింది. దీంతో మ‌హేష్ బాబును టార్గెట్ చేసింది. దేశ వ్యాప్తంగా ఈ విష‌యం క‌ల‌కలం రేపింది.

పై సంస్థ‌ల‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేశాడ‌ని తెలిపింది ఈడీ. మ‌హేష్ బాబు ఇందుకు గాను రూ. 5.9 కోట్లు తీసుకున్నాడ‌ని వెల్ల‌డించింది. ఈ మొత్తంలో రూ. 3.4 కోట్లు చెక్కు ద్వారా, రూ. 2.5 కోట్లు న‌గ‌దు ద్వారా త‌ను తీసుకున్నాడ‌ని స్ప‌ష్టం చేసింది ద‌ర్యాప్తు సంస్థ‌. కాగా ఈ న‌గ‌దు చెల్లింపు మ‌నీ లాండ‌రింగ్ నెట్ వ‌ర్క్ తో ముడిప‌డి ఉంద‌ని భావించింది. ఆ దిశ‌గా మ‌హ‌స్త్రష్ బాబుకు నోటీసులు జారీ చేసింది. విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిందిగా స్ప‌ష్టం చేసింది. హైదరాబాద్ ప్రాపర్టీస్ లిమిటెడ్‌కు చెందిన నరేంద్ర సురానా, సాయి సూర్య డెవలపర్స్‌కు చెందిన సతీష్ చంద్ర గుప్తాపై కేసులు న‌మోదు చేశారు.

Also Read : Hero Naga Chaitanya : మిథిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీపై నాగ‌చైత‌న్య ఫోక‌స్

EDMahesh BabuNoticesUpdatesViral
Comments (0)
Add Comment