Natural Star Nani-Hit 3 :నాని సంచ‌ల‌నం హిట్ 3 విజ‌యోత్స‌వం

తొలి షో నుంచే హిట్ టాక్ ..హిట్ 4 త్వ‌ర‌లో

Hit 3 : నేచుర‌ల్ స్టార్ త‌న రూట్ మార్చేశాడు. న‌టుడిగా ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకున్న ఈ న‌టుడు నిర్మాత‌గా కూడా మారాడు. త‌ను తీసిన కోర్ట్ సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. ఓటీటీ రైట్స్ ఏకంగా రూ. 8 కోట్ల‌కు అమ్ముడు పోయింది. టాలెంట్ క‌లిగిన వాళ్లు ఎవ‌రున్నా స‌రే వారికి ఫుల్ స‌పోర్ట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఒక ర‌కంగా టాలీవుడ్ లో త‌న‌కంటూ ఓ టీంను త‌యారు చేసే ప‌నిలో ప‌డ్డాడు. ఇదే స‌మ‌యంలో తాజాగా త‌నతో పాటు క‌న్న‌డ స్టార్ హీరోయిన్ శ్రీ‌నిధి శెట్టితో క‌లిసి న‌టించిన చిత్రం హిట్ 3. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

Natural Star Nani – Hit 3 Talk

తొలి షో నుంచే హిట్ టాక్ తో దూసుకు పోతోంది. భారీ ఎత్తున క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఇప్ప‌టికే సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు న‌టుడు నాని. త‌ను కోర్ట్ ఈవెంట్ సంద‌ర్బంగా ఈ సినిమా బాగో లేక పోతే తాను న‌టించిన హిట్ 3(Hit 3) చూడ‌కండి అని, అంతే కాదు ఎవ‌రైనా కొనుగోలు చేసిన టికెట్ల ధ‌ర‌ను తిరిగి ఇస్తామంటూ ప్ర‌క‌టించాడు. ఆయ‌న చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. ఇది సినిమాకు అద‌న‌పు బ‌లంగా మారేలా చేసింది. ఇక శైలేష్ కొల‌ను హిట్ 3ని తీశాడు. ఇందులో హింస మ‌రింత భ‌య‌పెట్టేలా చేసింది.

అయినా కావాల‌ని తీయ‌లేద‌ని, కేవ‌లం చిత్ర క‌థ ప‌రంగా చేయాల్సి వ‌చ్చింద‌న్నాడు నేచుర‌ల్ స్టార్ నాని. ఎవ‌రూ కూడా ఊహించ‌లేదు. త‌ను ఇలాంటి పాత్ర‌లో న‌టిస్తాడ‌ని. ఇది ప‌క్క‌న పెడితే హిట్ 3 మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో సంబురాల‌లో మునిగి పోయారు ద‌ర్శ‌కుడు, న‌టుడు, నిర్మాత‌లు. ఈ సంద‌ర్బంగా కీల‌క అప్ డేట్ ఇచ్చాడు నాని. త్వ‌ర‌లోనే హిట్ 4 రాబోతోంద‌ని ప్ర‌క‌టించాడు. ఇది మ‌రో సీక్వెల్ ఖాయ‌మ‌న్నాడు. ఇందులో త‌మిళ సినీ రంగానికి చెందిన న‌టుడు కార్తీ న‌టిస్తాడ‌ని తెలిపాడు. మొత్తంగా నాని ఏది చేసినా, ఏం మాట్లాడినా అది సంచ‌ల‌నంగా మారుతోంది.

Also Read : Farah Khan Shocking :ఫ‌ర్హా ఖాన్ మెస్మ‌రైజ్ అందం అదుర్స్

CinemaHit-3Natural Star NaniUpdatesViral
Comments (0)
Add Comment