Hit-3 : నేచురల్ స్టార్, నిర్మాత నాని ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు. తను తాజాగా నిర్మించిన ప్రియదర్శి, హర్ష వర్దన్, శివాజీ కీలక పాత్రల్లో నటించిన కోర్ట్ ఊహించని రీతిలో సక్సెస్ టాక్ తెచ్చుకుంది. భారీ ఆదాయాన్ని సమకూర్చేలా చేసింది. ఈ తరుణంలో తను నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. తాను కీ రోల్ పోషించిన హిట్ 3 మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్బంగా మూవీ మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు శైలేష్ కొలను.
Hero Nani – Hit-3 Movie Updates
ఇందులో ప్రశాంత్ నీల్ తీసిన యశ్ తో నటించిన ముద్దుగుమ్మ శ్రీనిధి శెట్టి జతగా నటించింది. హిట్ 3(Hit-3) మూవీ పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ కు ఆశించిన దానికంటే స్పందన లభించింది. దీంతో పూర్తి నమ్మకంతో ఉన్నాడు నేచురల్ స్టార్. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భిన్నంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీనికి ముఖ్య అతిథులుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ఆయన భార్య విచ్చేశారు. తను నానితో ఈగ మూవీ తీశాడు. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబుతో ఎస్ఎస్ఎంబీ29 సినిమా తీస్తున్నాడు. ఆ తర్వాత మహాభారత్ తీస్తానని ప్రకటించాడు.
ఈ సందర్బంగా సంచలన ప్రకటన చేశాడు జక్కన్న. తను తీయబోయే ఇతిహాసం చిత్రంలో నాని తప్పకుండా ఉంటాడని స్పష్టం చేశాడు. ఇదే సమయంలో సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు నేచురల్ స్టార్. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరం వంద శాతం మనసు పెట్టి పని చేశామన్నాడు. హిట్ 3 ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అన్ని వర్గాలను ఆకట్టుకుంటుంది. ఎవరు ఏమన్నా సినిమా సక్సెస్ కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాను కంటెంట్ ను ఎక్కువగా నమ్ముకుంటానని , అందుకే ఈ మాట చెబుతున్నానంటూ తెలిపాడు నాని.
Also Read : Hero Mahesh Babu-ED : ఈడీ విచారణకు మహేష్ బాబు డుమ్మా