Prudhvi Shocking Comments :పృథ్వీ కామెంట్స్ లైలాకు షాక్

బాయ్ కాట్ లైలా ట్రెండింగ్

Prudhvi : నోరు మంచిదైతే ఊరు మంచిద‌వుతుందని తెలిసినా ఎందుక‌నో న‌టుడు, 30 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ దుమ్ము రేపిన పృథ్వీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. త‌ను విశ్వ‌క్ సేన్ న‌టించిన లైలాలో ఓ పాత్ర‌లో న‌టించాడు. దీనికి సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ చిత్రం ఈనెల 14న ప్రేమికుల రోజున విడుద‌ల కానుంది. ఇందులో రెండు పాత్ర‌ల‌లో న‌టించాడు విశ్వ‌క్ సేన్. ఈ సినిమాకు ప్ర‌త్యేక అతిథిగా హాజ‌ర‌య్యాడు మెగాస్టార్ చిరంజీవి. ఈ మూవీ త‌ప్ప‌కుండా స‌క్సెస్ అవుతుంద‌ని న‌మ్మ‌కం వ్య‌క్తం చేశాడు.

Prudhvi Shocking Comments

ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి బాంబు పేల్చాడు పృథ్వీ(Prudhvi). త‌ను గ‌తంలో మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్. ఆ త‌ర్వాత టీటీడీ ఎస్వీబీసీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చిన‌ట్టే ఇచ్చి, లైంగిక ఆరోప‌ణ‌ల‌తో త‌నంత‌కు తానుగా త‌ప్పుకునేలా చేశారు. ఆ త‌ర్వాత డిప్రెష‌న్ లోకి వెళ్లి పోయాడు.

జ‌గ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి, వైసీపీకి వ్య‌తిరేకంగా ప‌ని చేశాడు. తాజాగా ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ కూట‌మి అధికారంలోకి వ‌చ్చింది. వైసీపీ కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమిత‌మైంది. ఈ సంద‌ర్బంగా లైలా పాత్ర గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. తాను చేసిన కామెంట్స్ ఓ వ‌ర్గం వారిని కించ‌ప‌రిచేలా ఉండ‌డంతో ట్రోల్ కు గుర‌య్యాడు.

దీనిపై స్పందించాడు న‌టుడు పృథ్వీ. ప్ర‌స్తుతం ఏది మాట్లాడినా వైర‌ల్ గా మారుతోంద‌ని ఆవేద‌న చెందాడు. తాను ఎవ‌రినీ కించ ప‌రిచేలా అన‌లేద‌ని పేర్కొన్నాడు. మొత్తంగా ఎక్స్ వేదిక‌గా బాయ్ కాట్ లైలా అనే ట్యాగ్ తో ట్రెండింగ్ లో కొన‌సాగుతోంది.

Also Read : Hero Ashok Galla Movie : హాట్ స్టార్ లో దేవ‌కి నంద‌న వాసుదేవ‌

CommentsViral
Comments (0)
Add Comment