Hero Rajkummar Rao Praises :నేచుర‌ల్ స్టార్ కు రాజ్ కుమార్ రావు ప్ర‌శంస‌

ప్రేక్ష‌కుల ముందుకు రానున్న హిట్ -3 మూవీ

Rajkummar Rao : మినిమం గ్యారెంటీ క‌లిగిన గుర్తింపు పొందాడు నేచుర‌ల్ స్టార్ నాని. త‌ను న‌టించిన చిత్రం హిట్ 3 ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ప్ర‌మోష‌న్స్ జోష్ పెంచాడు. ఇటు హిందీ వెర్ష‌న్ ను కూడా తీసుకు వ‌చ్చారు మూవీ మేక‌ర్స్. ఇదే స‌మ‌యంలో త‌ను ఓ వైపు మూవీస్ ల‌లో న‌టిస్తూనే ఇంకో వైపు నిర్మాణ రంగంలోకి ఎంట‌ర్ అయ్యాడు. తాను తాజాగా తీసిన కోర్ట్ బిగ్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం ప‌లువురు ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక హిట్ 3కి సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, సాంగ్స్ కు మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. దీంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి.

Rajkummar Rao Appreciates Natural Star

ఈ త‌రుణంలో హిందీలో కూడా ప్ర‌మోష‌న్స్ కు ప్లాన్ చేశాడు నాని. ఈ సంద‌ర్బంగా నాని గురించి బాలీవుడ్ లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ స్వంతం చేసుకున్న యాక్ట‌ర్ రాజ్ కుమార్ రావు(Rajkummar Rao) స్పందించాడు. త‌న మ‌న‌సులోని మాట‌ను బ‌య‌ట పెట్టాడు. చిట్ చాట్ సంద‌ర్బంగా నేచుర‌ల్ స్టార్ ను ఆకాశానికి ఎత్తేశాడు. త‌న న‌ట‌న అద్భుతంగా ఉంద‌న్నాడు. సినిమా రంగానికి సంబంధించి ఏ న‌టుడికైనా మంచి పాత్ర ల‌భించాల‌ని కోరిక ఉంటుంద‌ని చెప్పాడు. దీని వ‌ల్ల త‌న‌కే కాకుండా మూవీకి కూడా ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌న్నాడు రాజ్ కుమార్ రావు.

ఈ సంద‌ర్బంగా న‌టుడు నాని స్పందించాడు. తాను ఇంకా హిట్ 3 మూవీకి సంబంధించిన హిందీ వెర్ష‌న్ ను చూడ‌లేద‌న్నాడు. దీనిని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించాడ‌ని, త‌న నుంచి సినిమా రైట్స్ తీసుకున్నాడ‌ని చెప్పాడు. ఇక త‌న గురించి రాజ్ కుమార్ రావు చేసిన కామెంట్స్ కు ధ‌న్య‌వాదాలు తెలిపాడు. ఆయ‌న తెలివైన న‌టుడు. త‌ను న‌టించిన సినిమాలు చాలా చూశాన‌ని , త‌న గురించి నాకు ప్ర‌శంస‌లు ద‌క్క‌డం ఆనందంగా ఉంద‌ని, మ‌రిచి పోలేన‌ని పేర్కొన్నాడు నేచుర‌ల్ స్టార్.

Also Read : Hero Vijay Deverakonda-Pahalgam : పాకిస్తాన్ ఉగ్ర‌వాదం దేవ‌ర‌కొండ ఆగ్ర‌హం

Hero NaniPraisesUpdatesViral
Comments (0)
Add Comment