Actor Sangeetha : ఆ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీలో గౌరవం ఉంటుంది

తమిళంలో నటించడం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పగలను...

Actor Sangeetha : ఒకపుడు తెలుగులో పాపులర్‌ నటిగా గుర్తింపు పొందారు సంగీత(Actor Sangeetha). ‘ ఒక్క ఛాన్స్’ అంటూ… ‘ఖడ్గం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైందీ బ్యూటీ. పెద్ద సినిమా నటి కావాలన్న ఆశతో పల్లెటూరి నుంచి తల్లితో కలిసి హైదరబాద్‌కు వచ్చి ఒక్క ఛాన్స్ అంటూ బ్రతిమలాడుతూ కంట తడిపెట్టే సన్నివేశంలో ఆమె నటనను ఎవరూ అంత సులభంగా మర్చిపోలేరు. అలాంటి సంగీత అతి తక్కువ సమయంలో దక్షిణాది అన్ని భాషల్లోనూ నటించారు. తదుపరి గాయకుడు క్రిష్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కూతురు కూడా ఉన్నారు. వివాహానంతరం సినిమాలకు విరామం ఇచ్చారు. రెండేళ్ల క్రితం క్యారక్టర్‌ ఆర్టిస్ట్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే పలు టీవీ షోలు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ చర్చలో పాల్గొన్న ఆమె తనకు తమిళ చిత్రాల్లో కంటే తెలుగు చిత్రాల్లో నటించడమే ఇష్టమని చెప్పారు. అందుకు కారణం తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ గౌరవం లభిస్తుందన్నారు.

Actor Sangeetha Comment

“తమిళంలో నటించడం ఇష్టం లేదని ధైర్యంగా చెప్పగలను. దాని వల్ల తమిళ అభిమానులు ఆగ్రహించవచ్చు. అయినా నేను చెప్పేది నిజం. అనుభవంతో చెబుతున్నారు. కోలీవుడ్‌లో ఆర్టిస్ట్‌కు మర్యాద లేదు. నిజం చెప్పాలంటే తమిళంలో నేను ఎవరినీ అవకాశాలు అడిగింది లేదు. నాకు తెలుగులో మంచి ఆదరణ ఉంది. అంతే కాదు మంచి పారితోషికం, అవకాశాలు నాకు ఇక్కడ వస్తున్నాయి. అయితే తమిళంలో కొందరు అవకాశాల కోసం ఫోన్‌ చేస్తారు. కానీ మర్యాద లేకుండా మాట్లాడతారు. వారే తనకు జీవితాన్ని ఇస్తున్నట్లు మాట్లాడతారు. పారితోషికాన్ని కూడా వారే నిర్ణయించేసి వచ్చి నటించి వెళ్లండి అని ఫిక్స్‌ చేసేస్తున్నారు. అందుకే తమిళ పరిశ్రమకు ఆర్టిస్ట్‌ల పట్ల మర్యాద లేదని చెబుతున్నాను. అందుకే తమిళ చిత్రాల్లో ఎక్కువగా నటించడం లేదు” అని అన్నారు. ప్రస్తుతం సంగీత వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

Also Read : Viraji OTT : అప్పుడే ఓటీటీలో చ్చక్కర్లు కొడుతున్న వరుణ్ సందేశ్ ‘విరాజి’

CommentssangeethaTollywoodViral
Comments (0)
Add Comment