Dandora : విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు శివాజీ. దాదాపు 10 ఏళ్ల తర్వాత తను ఉన్నట్టుండి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఫుల్ మార్కులు కొట్టేశాడు. ఇటీవల నటుడు నాని నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం కోర్ట్. దీనిని రామ్ జగదీశ్ తీశాడు. ఇందులో ప్రియదర్శి, హర్ష వర్దన్ తో పాటు కీ రోల్ పోషించాడు శివాజీ. ఈవెంట్ సందర్బంగా కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు. ఇంత పవర్ ఫుల్ పాత్ర ఇచ్చినందుకు వేదిక నుంచే నానికి ధన్యవాదాలు తెలిపాడు.
Dandora Movie Updates
కోర్ట్ చిత్రం శివాజీకి(Sivaji)ప్లస్ పాయింట్ అయ్యిందని చెప్పక తప్పదు. మంచి పాత్రలు, ముఖ్యంగా ఆకట్టుకునే పాత్రలు తనకోసం వస్తున్నాయి. ఇది మంచి పరిణామం. ఇదే సమయంలో తాజాగా తెలంగాణ సమాజంలో చోటు చేసుకున్న సమస్యలు, ఇతర అంశాలను ప్రాతిపదికగా తీసుకుని తీస్తున్న చిత్రం దండోరా. కలర్ ఫోటో, బెదురు లంక సినిమాలు బిగ్ సక్సెస్ అయ్యాయి. వీటిని నిర్మించారు లౌక్య ఎంటర్ టైన్మెంట్ కు చెందిన నిర్మాత రవీంద్ర బెనర్జీ. దండోరా చిత్రాన్ని నిర్మిస్తుండడంతో అంచనాలు మరింత పెంచేలా చేశాయి.
ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ బీట్ ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. రెండో షెడ్యూల్ శరవేగంగా కొనసాగుతోంది. తెలంగాణ ప్రాంతంలోని మెదక్ జిల్లా ధరిపల్లి ఊరులో స్టార్ట్ చేశారు దర్శకుడు. ఈ షూటింగ్ 25 రోజుల పాటు చిత్రీకరించనున్నారు. సామాజిక వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపించాలని ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. దండోరా మూవీలో నవదీప్ , రవికృష్ణ,, నందు, మాణికా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాదవి, రాధ్య కీ రోల్స్ పోషిస్తున్నారు. దండోరాకు మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read : Hero Bunny-Atlee :బన్నీతో అట్లీ ఇంటర్నేషనల్ మూవీ